న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England 5th Test: అయ్యయ్యో నా రికార్డు మంటగలిసిపోయిందే.. మాజీ సౌతాఫ్రికా బౌలర్ ఆవేదన

Former Southafrican Robin Peterson Hilarious Tweet After His Expensive single Over Record Broke

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రాబిన్ పీటర్సన్ శనివారం ఓ సరదా ట్వీట్ చేశాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు.. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా స్టువర్ట్ బ్రాడ్ చెత్త రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్టువర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్లో 35పరుగులు ఇచ్చాడు. అందులో 6పరుగులు నోబ్ ప్లస్ వైడ్ ఫోర్‌గా రాగా.. మిగితావి బుమ్రా చేసిన 29పరుగులు. ఇకపోతే అంతకుముందు రాబిన్ పీటర్సన్ టెస్టులో ఒకే ఓవర్లో 28పరుగులు ఇచ్చాడు. 2003 డిసెంబర్లో దిగ్గజ వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా టెస్ట్ క్రికెట్‌లో రాబిన్ పీటర్సన్ వేసిన ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పీటర్సన్ ఈ వరస్ట్ రికార్డును నెలకొల్పాడు.

ఆ మ్యాచ్‌లో పీటర్సన్ వేసిన ఓవర్లో లారా 4ఫోర్లు, 2 సిక్సర్లు బాది 28పరుగులు దండుకున్నాడు. ఇకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే.. లారా ఓ మ్యాచ్‌లో రాణించినప్పటికీ కరేబియన్ జట్టు 189పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక శనివారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న అయిదో టెస్ట్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84ఓవర్లో బుమ్రా 35పరుగులు బాదడంతో అప్పటి రికార్డు బద్ధలైంది. ఇక ఈ మ్యాచ్‌లో మరీ విచిత్రం ఏంటంటే.. బ్రాడ్ ఒక్క బంతి వేయకుండానే.. 12పరుగులు ఇచ్చాడు. అదెలాగంటే.. రెండో బంతి వైడ్ ఫోర్, తర్వాత బాల్ నోబ్ సిక్సర్ రావడంతో 12పరుగులు ఒక్క బంతి పడకుండానే వచ్చాయి. ఇక ఈ ఓవర్లో బుమ్రా తొలి బంతికి ఫోర్, 3, 4వ బంతలకు ఫోర్, 5 బంతికి సిక్స్, ఆరో బంతికి సింగిల్ తీయడంతో 35పరుగులొచ్చాయి.

పీటర్సన్ ఈ విసయమై ట్వీట్ చేస్తూ.. 'ఈ రోజు నా రికార్డును కోల్పోవడం విచారకరం. అయినా రికార్డులు బద్ధలవ్వడం అనేది సహజం' అంటూ పీటర్సన్ వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఇక తన చెత్త రికార్డు కంటే స్టువర్ట్ బ్రాడ్ మరింత చెత్త రికార్డు నమోదు చేశాడనేది పీటర్సన్ ఇంటెన్షన్. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రా 16బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను చివర్లో రాణించడంతో.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ 5వికెట్ల హాల్ సాధించాడు.

Story first published: Saturday, July 2, 2022, 20:34 [IST]
Other articles published on Jul 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X