న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : గిల్‌ను పక్కన పెట్టేసి.. పృథ్వీ షాను ఆడించాలి!

Former legend wants Prithvi Shaw to play instead of Shubman Gill

ఈ ఏడాదిలో టీమిండియా ఆడిన అన్ని టీ20 మ్యాచుల్లో శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వచ్చాడు. ఇషాన్ కిషన్, గిల్ జోడీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా గిల్ ఆటతీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశాడు. గిల్ ఆట వన్డేలకు సరిగ్గా సరిపోతుందని, కానీ టీ20ల్లో అతను రాణించడం కష్టమని అంతకుముందు నుంచే కొందరు అంటున్నారు. కానీ వన్డేల్లో అదరగొడుతున్న అతనిపై టీం మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది.

ముఖ్యంగా కివీస్‌తో సిరీస్‌లో పృథ్వీ షా వంటి విధ్వంసకర బ్యాటర్‌ను ఎంపిక చేసినా కూడా మేనేజ్‌మెంట్ మాత్రం గిల్‌కే అవకాశం ఇచ్చింది. అతనే తమ తొలి ఎంపిక అని హార్దిక్ పాండ్యా కూడా చాలా స్పష్టంగా చెప్పేశాడు. అయితే తనకు వచ్చిన అవకాశాలను గిల్ ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 46 పరుగులు చేసిన అతను.. ఆ తర్వాత ఒక్కసారి కూడా 15 పరుగులు కూడా చేయలేదు. కివీస్‌తో జరుగుతున్న టీ20ల్లో కూడా రాణించడం లేదు.

Former legend wants Prithvi Shaw to play instead of Shubman Gill

ఈ క్రమంలో అతన్ని పక్కన పెట్టి పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని పాక్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా అంటున్నాడు. పృథ్వీ షా ఎగ్జయిటింగ్ బ్యాటర్ అని కనేరియా అభిప్రాయపడ్డాడు. 'కివీస్‌తో ఇది లాస్ట్ గేమ్. శుభ్‌మన్ గిల్ ఎలా ఆడతాడో మనం చూసేశాం.

ఇప్పుడైనా పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి. అతనో ఎగ్జయిటింగ్ ప్లేయర్. ఎటాకింగ్ ఆటకు పెట్టింది పేరు. అతనికి గిల్ స్థానంలో ఛాన్స్ ఇవ్వాలి. అతనిలో ఎదురు దాడికి దిగే ఆ ఆకలి ఉంది. నిలకడగా అవకాశాలు ఇస్తే జట్టుకు గొప్ప సేవ అందించగలడు' అని వివరించాడు. గిల్ ప్రస్తుతం స్పిన్ ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. స్పిన్, బౌన్స్ ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టాలని చెప్పాడు.

Story first published: Monday, January 30, 2023, 16:42 [IST]
Other articles published on Jan 30, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X