న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమెరికాలో తొలిసారి: ఇండియా-విండీస్ టీ20 సిరీస్

ముంబై: వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ ఆడుతున్న టీమిండియా.. సిరీస్ ముగిసిన తర్వాత ఆ జట్టుతో రెండు టీ20 మ్యాచ్‌ల ఆడనుంది. అయితే ఈ అంతర్జాతీయ టీ-20 సిరీస్‌కు అమెరికా తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. ఫ్లోరిడా వేదికగా భారత్-వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది.

సెంట్రల్‌ బ్రోవర్డ్‌ రీజినల్‌ పార్క్‌లో ఆగస్టు 27, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకరించింది. కాగా, భారత జట్టుకు ధోనీ, కోహ్లీ.. విండీస్‌కు క్రిస్‌ గేల్‌, డ్వేన్‌ బ్రావో వంటి స్టార్లు ప్రాతినిధ్యం వహించనున్నారు.

First time in USA: Team India to play two T20Is against West Indies

గతంలో ఈ స్టేడియం వేదికగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరిగాయి. అమెరికాలోని భారతీయులను దృష్టిలో పెట్టుకుని విండీస్‌ బోర్డుతో కలిసి బీసీసీఐ ఈ సిరీస్‌ను ప్లాన్‌ చేసింది.

'క్రికెట్‌కు కొత్త మార్కెట్‌ను సృష్టించేందుకు కృషి చేస్తున్నాం. అమెరికా వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య టీ-20 సిరీస్‌ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రెండు అగ్ర జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌ యూఎస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఇది వారికి మంచి అవకాశమని చెప్పారు.

టీ20ల షెడ్యూల్:

తొలి టీ20: ఆగస్టు(శనివారం): రాత్రి 7.30గంటలకు, సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్, ఫ్లోరిడా.

2వ టీ20: ఆగస్టు 28(ఆదివారం): రాత్రి 7.30గంటలకు, సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్, ఫ్లోరిడా.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X