న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందరూ వెళ్లిపోయినా.. కఠినంగా ప్రాక్టీసు చేస్తున్న ధోనీ

Mahendra Singh Dhoni works Hard For Upcoming Matches
Far from madding crowd, MS Dhoni trains alone at NCA

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈనెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ధోనీ గత రెండు రోజుల నుంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ అనంతరం భారత జట్టు ఆడబోతున్న మరో షార్ట్ ఫార్మాట్ ఐర్లాండ్ టీ20. అయితే బీసీసీఐ ఇందులో పాల్గొనేముందు యోయో ఫిట్‌నెస్ టెస్టు తప్పనిసరి చేసింది. ఇటీవలే భారత జట్టు ఆటగాళ్లంతా బెంగళూరు వేదికగా ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొన్నారు. అయితే కొందరికీ నిరాశ తప్పకపోయినా మిగిలిన వాళ్లు టెస్టు పాసై మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు.

ఈ నేపథ్యంలో.. గత శుక్రవారం ఇదే అకాడమీలో నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్‌ టెస్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ భువనేశ్వర్ కుమార్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ సురేశ్ రైనా, కేదార్ జాదవ్‌తో కలిసి హాజరైన ధోనీ ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫిట్‌నెస్ టెస్టు తర్వాత మిగిలిన క్రికెటర్లు వెళ్లిపోగా.. ధోనీ మాత్రం అకాడమీలోనే ఉంటూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్‌లో మునుపటి హిట్టింగ్‌తో ఆకట్టుకున్న ధోనీ.. అదే జోరుని ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ పర్యటనల్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నాడు. జట్టులో పోటీ పెరగడం, బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుకు రావాలని ధోనీ యోచిస్తున్న నేపథ్యంలో అతను నెట్స్‌లో మునుపటి కంటే ఎక్కువగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియగా.. ఆ మ్యాచ్‌కి తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ నెట్స్‌లో ధోనీకి బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది.

Story first published: Monday, June 18, 2018, 18:49 [IST]
Other articles published on Jun 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X