న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

End of an era: ఆరేళ్ల క్రితం క్రికెట్ దేవుడు వీడ్కోలు పలికిన వేళ!

End of an era: Sachin Tendulkar retired on this day 6 years ago

హైదరాబాద్: క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నవంబర్‌ 15 తేదీతో తన అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన 30 ఏళ్లు పూర్తి కాగా, ఆ మురసటి రోజు అంటే నవంబర్‌ 16వ తేదీ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆరేళ్లు పూర్తయ్యాయి. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఘనత సచిన్‌ది

1989 నవంబర్‌ 15న కరాచి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఓ బాలుడిగా అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ ఆ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వకార్ యూనిస్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకదాని తర్వాత మరొకటి రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఎన్నో మైలురాళ్లను నెలకొల్పాడు.

IPL 2020: తేదీ, వేదిక, వేలం, మిగిలిన నగదు, టీవీ ఇన్ఫో వివరాలు!IPL 2020: తేదీ, వేదిక, వేలం, మిగిలిన నగదు, టీవీ ఇన్ఫో వివరాలు!

టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు

టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు

అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించిన సచిన్... అత్యధిక మ్యాన్ అఫ్ ది మ్యాచ్, మ్యాన్ అఫ్ ది సిరీస్‌లను అందుకున్న ఏకైక బ్యాట్స్‌మ‌న్గా అరుదైన ఘనత సాధించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు, 463 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

నవంబర్‌ 16, 2013న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్

నవంబర్‌ 16, 2013న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్

అలాంటి సచిన్ నవంబర్‌ 16, 2013న సచిన్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సరిగ్గా ఆరేళ్ల క్రితం వెస్టిండిస్‌తో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ సచిన్ టెండూల్కర్‌కు ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. నవంబర్‌ 14న ప్రారంభమైన ఆ టెస్టు మ్యాచ్ నవంబర్‌ 16వ తేదీతో ముగిసింది.

ఇన్నింగ్స్‌ 126 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

ఇన్నింగ్స్‌ 126 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 126 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సచిన్‌ 74 పరుగులు చేశాడు. 200 టెస్టులాడి 53.78 యావరేజితో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల విషయానికి వస్తే 463 వన్డేలాడి 44.83 యావరేజితో 18,426 పరుగులు చేశాడు.

2011లో వరల్డ్‌కప్ నెగ్గిన టీమిండియా

2011లో వరల్డ్‌కప్ నెగ్గిన టీమిండియా

ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా పార్ట్‌టైమ్‌ బౌలర్‌ అన్న సంగతి తెలిసిందే. బౌలర్‌గా టెస్టుల్లో 46 వికెట్లు, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరుపున ఏకైక టీ20 మ్యాచ్ కూడా ఆడాడు. 2011లో వరల్డ్‌కప్‌ను ముద్దాడిన తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు.

సచిన్ గురించి తెలియని విషయాలు

సచిన్ గురించి తెలియని విషయాలు

* ప్రసిద్ధ హిందీ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ పేరు మీద అతని తండ్రి సచిన్ టెండూల్కర్ అని పేరు పెట్టడం జరిగింది. ముంబై జట్టులోని సహచర ఆటగాడు ప్రవీణ్ అమ్రే తనకు ఒక జత అంతర్జాతీయ క్రికెట్ షూలను కొన్నాడు.

* సచిన్ టెండూల్కర్‌కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ అతడికి ప్రత్యేకంగా రూపొందించిన అల్ట్రా-లైట్ ప్యాడ్లను బహుమతిగా ఇచ్చాడు.

* సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి కారు మారుతి 800.

* 19 ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్ ఇంగ్లీషు కౌంటీ క్రికెట్ ఆడాడు. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ సచినే.

* సచిన్ టెండూల్కర్ కుడి చేతితో బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసినప్పటికీ... ఎడమచేతిని తినడానికి వ్రాసేందుకు ఉపయోగిస్తాడు.

Story first published: Monday, November 18, 2019, 13:28 [IST]
Other articles published on Nov 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X