న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా పర్యటనకు ముందే గాడిలో పడిన ధావన్, పంత్!

Dhawan, Pant erase worry lines before flight to Australia

హైదరాబాద్: పర్యాటక వెస్టిండిస్‌తో పరిమిత ఓవర్ల సిరిస్‌లో వరుసగా విఫలమవుతూ వచ్చిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెన్నై వేదికగా జరిగిన టీ20లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. విండిస్ నిర్దేశించిన 182 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

<strong>ధోనికి సాధ్యం కాలేదు: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ముష్ఫికర్</strong>ధోనికి సాధ్యం కాలేదు: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ముష్ఫికర్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విండిస్ బ్యాట్స్‌మెన్లలో నికొలస్‌ పూరన్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, డారెన్‌ బ్రేవో (37 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించాడు.

ఆఖరి బంతికి టీమిండియా విజయం

ఆఖరి బంతికి టీమిండియా విజయం

అనంతరం శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడటంతో టీమిండియా ఆఖరి బంతికి విజయం సాధించింది. . వీరిద్దరూ మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్‌కు ఇదే అత్యధిక స్కోరు కాగా, పంత్ తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు.

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు

ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుండటంతో ఈ పర్యటనకి ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్‌ అందుకోవడం భారత్ జట్టుకి గొప్ప ఉపశమనమని మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

వన్డే, టీ20ల్లో రిషబ్ పంత్ విఫలం

వన్డే, టీ20ల్లో రిషబ్ పంత్ విఫలం

వాస్తవానికి, చెన్నై టీ20కి ముందు వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, రెండు టీ20లు ఆడిన శిఖర్ ధావన్ చేసిన అత్యధిక పరుగులు 43. లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో ఈ పరుగులను నమోదు చేశాడు. ఇక, పంత్ విషయానికి వస్తే, వెస్టిండీస్‌తో రెండు టెస్టుల్లోనూ 92, 92 పరుగులతో సత్తాచాటినప్పటికీ... వన్డే, టీ20ల్లో విఫలమయ్యాడు.

చివరి రెండు వన్డేల్లో రిజర్వ్ బెంచికి పరిమితమైన పంత్

చివరి రెండు వన్డేల్లో రిజర్వ్ బెంచికి పరిమితమైన పంత్

దీంతో విండీస్‌పై మూడు వన్డేల అనంతరం అతనిపై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్ చివరి రెండు వన్డేల్లోనూ పంత్‌ను రిజర్వ్ బెంచ్‌కి పరిమితం చేసింది. ఆ తర్వాత ప్రారంభమైన టీ20ల్లో పంత్‌కు జట్టు మేనేజ్‌మెంట్ తుది జట్టులో అవకాశమిచ్చింది. తొలి రెండు టీ20ల్లోనూ పంత్ చేసిన పరుగులు 1, 5 పరుగులు మాత్రమే.

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్

నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్

దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్‌లో రిషబ్ పంత్‌కు చోటు దక్కుతుందా? లేదా అన్నది అనుమానంగా మారింది. అయితే, చెన్నై వేదికగా జరిగిన ఆఖరి టీ20లో రాణించిన ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా‌తో నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్‌కు మార్గం సుగమనం చేసుకున్నారు. నవంబర్ 21 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది.

Story first published: Monday, November 12, 2018, 16:58 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X