న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ గొప్ప ఆటగాడు, బుమ్రా బౌలింగ్ అంటే ఎంతో ఇష్టం: డెన్నిస్ లిల్లీ

Dennis Lillee Lauds Virat Kohli For Technique, Determination And Balance

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ప్రవర్తనపై ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లపై కోహ్లీ తీరుపై విమర్శలు చేస్తుండగా... మరికొందరు మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం డెన్నిస్‌ లిల్లీ చేరాడు.

<strong>బీసీసీఐ సెల్ఫ్ గోల్: బెంగళూరు జట్టుకు కోచ్‌గా ఉన్నాడనే ఎంచుకోలేదా?</strong>బీసీసీఐ సెల్ఫ్ గోల్: బెంగళూరు జట్టుకు కోచ్‌గా ఉన్నాడనే ఎంచుకోలేదా?

మోడ్రన్ డే దిగ్గజాల్లో విరాట్‌ కోహ్లీ ఒకడని, అతని గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరమేమీ లేదని డెన్నిస్‌ లిల్లీ అన్నాడు. ఈ సందర్భంగా డెన్నిస్ లిల్లీ మాట్లాడుతూ ''విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.

నేను చూసిన వాళ్లలో కోహ్లీ ఓ గొప్ప క్రికెటర్‌

నేను చూసిన వాళ్లలో కోహ్లీ ఓ గొప్ప క్రికెటర్‌

"మ్యాచ్‌లో అతడు అనుసరించే వ్యూహాలు ఎంతో బాగుంటాయి. నేను చూసిన వాళ్లలో కోహ్లీ ఓ గొప్ప క్రికెటర్‌. ఎటువంటి బౌలింగ్‌నైనా అతడు సమర్థంగా ఎదుర్కోగలడు. కోహ్లీ టెక్నిక్‌, నియంత్రణ, డెలివరీలను ఎదుర్కోవడానికి పొందే సమయం అతణ్ని గొప్ప ఆటగాణ్ని చేస్తున్నాయి" అని డెన్నిస్ లిల్లీ చెప్పాడు.

కోహ్లీ బంతిని చాలా ముందే చూస్తాడు

కోహ్లీ బంతిని చాలా ముందే చూస్తాడు

"కోహ్లీ బంతిని చాలా ముందే చూస్తాడు. గొప్ప బ్యాట్స్‌మెనందరిలో ఆ నాలుగు లక్షణాలు ఉంటాయి. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో అద్భుతమైన సెంచరీ చేశాడు. ప్రపంచ బ్యాట్స్‌మెన్లలో మేటిగా నిలిచాడు. అంత మంచి ఆటగాడి స్వభావం కూడా బాగానే ఉంటుదని నేను అనుకుంటున్నాను. కెప్టెన్‌కి దూకుడు అవసరం" అని అన్నాడు.

 బుమ్రా బౌలింగ్ అంటే ఇష్టం

బుమ్రా బౌలింగ్ అంటే ఇష్టం

ఇక, భారత బౌలర్లలో బుమ్రా బౌలింగ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. బుమ్రా గురించి మాట్లాడుతూ "బుమ్రాకి ఆట మీద ఎంతో ఆసక్తి ఉంటుంది. అతడు తన బౌలింగ్‌తో కనికట్టు చేయగలడు. అతడి బౌలింగ్‌ అద్భుతం. భారత బౌలర్లలో అతడెంతో ప్రత్యేకం. బుమ్రాను చూసినప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది" అని లిల్లీ అన్నాడు.

భారత్ తరుపున అత్యధిక వికెట్లు

భారత్ తరుపున అత్యధిక వికెట్లు

ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు(11) తీసిన బౌలర్‌గా బుమ్రా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, రెండో టెస్టులో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగినప్పటికీ ఓటమిపాలవడంపై డెన్నిస్ లిల్లీ ఇది ఫాస్ట్ బౌలర్ల అంశం కాదని, ప్రస్తుతం భారత్‌లో అద్భుతమైన పేసర్లు ఉన్నారని కొనియాడాడు.

Story first published: Friday, December 21, 2018, 13:21 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X