న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు కానీ.. డ్యాన్స్ చేయ‌లేడు: సీఏ ఆసక్తికర ట్వీట్

Cheteshwar Pujara just cant dance: Watch India stars celebrate historic win

హైదరాబాద్: సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు కోహ్లీసేన తెరదించింది. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలవడంతో భారత్ క్రికెటర్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

<strong>భారత ఆర్మీతో కలిసి నాగిని డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)</strong>భారత ఆర్మీతో కలిసి నాగిని డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ (వీడియో)

టెస్టు సిరిస్ గెలిచిన అనంతరం మైదానంలో టీమిండియా ఆటగాళ్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను డ్యాన్స్‌తో హోరెత్తించారు. 'భారత్ ఆర్మీ' అభిమానులు వినసొంపైన సంగీతంతో మైదానంలోని ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు. అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

మీరు చేసిన డ్యాన్స్‌కు అసలు అర్థమేంటి

మీరు చేసిన డ్యాన్స్‌కు అసలు అర్థమేంటి

ఈ సమావేశంలో ఓ జర్నలిస్ట్ 'మీరు చేసిన డ్యాన్స్‌కు అసలు అర్థమేంటి' అని కోహ్లీని అడిగాడు. 'ఆ ప్రశ్న రిషబ్ పంత్‌ను అడగండి. ఆ డ్యాన్స్ అతడు నేర్పించిందే. పంత్ చెబితే చేసాం' అని విరాట్ కోహ్లీ బదులిచ్చాడు. 'ఇది చాలా ఈజీ డాన్స్. పుజారా కనీసం ఆ డ్యాన్స్ కూడా చేయలేకపోయాడు. పుజారా నడిచేటప్పుడు చేతులు కూడా కదపడు. పుజారా నడకకు అడ్వాన్స్ వర్షెన్ ఇది' అని కోహ్లీ నవ్వుతూ అన్నాడు.

పుజారా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు కానీ.. డ్యాన్స్ చేయ‌లేడు

ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ 'పుజారా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు కానీ.. డ్యాన్స్ చేయ‌లేడు' అని ట్వీట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వర్షం కారణంగా

సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే అంతరాయ కలిగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్‌ చేయగా, ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలో ఆన్‌‌కు ఆహ్వానించాడు. నాలుగో రోజైన ఆదివారం ఆటలో ఆస్ట్రేలియా వికెట్‌ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది.

చివరిరోజు ఒక్క బంతి కూడా పడలేదు

చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించిన ఛటేశ్వర్ పుజారా(193) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో నెగ్గింది.

2-1తో సిరిస్ కైవసం

ఆ తర్వాత మెల్‌ బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు. ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయం సాధించడంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Monday, January 7, 2019, 18:25 [IST]
Other articles published on Jan 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X