న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆరో బౌలర్‌ విషయంలో భారత్ ఇప్పటికైనా కఠిన నిర్ణయం తీసుకోవాలి.. లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలి'

Brad Haddin feels Team India to replace Hardik Pandya with Shardul Thakur vs New Zealand clash
IND VS NZ : Team India T20 World Cup టైటిల్ ఆశలు వదిలేసుకోవాలి - Brad Haddin Oneindia Telugu

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా ఆరో బౌలర్ ఎంపిక విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్ బ్రాడ్ హ్యాడిన్ అన్నాడు. ఆదివారం (అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లోపు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చాడు. ఆరో బౌలర్‌ విషయంలో భారత కెప్టెన్, మేనేజ్మెంట్ ఇప్పటికైనా ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలని అని బ్రాడ్ హ్యాడిన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాకు బదులుగా మరో ఆల్‌రౌండర్‌ జట్టులోకి రావాలని ఆసీస్ మాజీ వికెట్‌ కీపర్ అంటున్నాడు.

అతడు బౌలింగ్ చేయకపోతే..వేరే ఆప్షన్ చూసుకోవాలి!భారత్ సెమీస్ చేరాలంటే మార్పులు తప్పవంటున్న బ్రెట్‌ లీ!అతడు బౌలింగ్ చేయకపోతే..వేరే ఆప్షన్ చూసుకోవాలి!భారత్ సెమీస్ చేరాలంటే మార్పులు తప్పవంటున్న బ్రెట్‌ లీ!

హార్దిక్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలి:

హార్దిక్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలి:

టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యాడు. కానీ అతడు బౌలింగ్‌ చేయడానికి ఇంకా ఫిట్‌గా లేనట్లు కనిపిస్తోంది. అందుకే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌ చేయలేదు. ఇక బ్యాట్‌తోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే యూఏఈలో ఐపీఎల్ 2021లో కూడా పెద్దగా రాణించలేదు. గత కొంత కాలంగా హార్దిక్ ఫామ్‌లో లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆరో బౌలర్‌ ఎంపిక గురించి బ్రాడ్ హ్యాడిన్‌ మాట్లాడాడు. బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేని హార్దిక్‌ను బెంచ్‌కు పరిమితం చేసి.. తుది జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకువచ్చే దిశగా భారత జట్టు యాజమాన్యం ఆలోచించాల్సిన వసరం ఎంతో ఉందని హ్యాడిన్ అభిప్రాయపడ్డాడు.

 మరో ఆల్‌రౌండర్‌ని తీసుకోవాలి:

మరో ఆల్‌రౌండర్‌ని తీసుకోవాలి:

తాజాగా ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్ బ్రాడ్ హ్యాడిన్ ఫాక్స్ క్రికెట్‌లో మాట్లాడుతూ... 'టీమిండియా ఆసక్తికరమైన సమస్యను ఎదుర్కొంటోంది. భారత జట్టును ఆరో బౌలర్ సమస్య వేధిస్తోంది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. చాలా కాలంగా బౌలింగ్‌ చేయని హార్థిక్ .. ఇప్పుడు బౌలింగ్‌ చేసినా విజయవంతం అవుతాడో లేదో అనే అనుమానమూ ఉంది. కాబట్టి ఆరో బౌలర్‌ లోటుని పూడ్చేందుకు జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌ని తీసుకోవాలి. భారత్ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. ఈ విషయం భారత జట్టుకు ఇప్పటికే అర్థమయి ఉంటుందని భావిస్తున్నా. లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలి' అని అన్నాడు.

శార్దూల్‌ ఉంటే బాగుంటుంది:

శార్దూల్‌ ఉంటే బాగుంటుంది:

హార్దిక్ పాండ్యాను తుది జట్టు నుంచి తప్పిస్తే.. అతడి స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ని తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసే శార్దూల్.. బ్యాట్‌తోనూ రాణించగలడు. సెప్టెంబరులో ముగిసిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఠాకూర్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. అటు బంతి, ఇటు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2021 ఫైనల్లో కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచును చెన్నై వైపు మళ్లించిన విషయం తెలిసిందే. భారీ సిక్సర్లు కొట్టడంలో అతడు దిట్ట. శార్దూల్‌ ఉంటే జట్టులో మంచి సమతూకం రానుంది.

Story first published: Thursday, October 28, 2021, 8:53 [IST]
Other articles published on Oct 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X