న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇన్‌స్టాగ్రామ్‌లో బీసీసీఐ ట్వీట్.. కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయి!!

BCCI Asks Fans To Caption Virat Kohli Picture, Shreyas Iyer chipped in with a caption

ఢిల్లీ: భార‌త్‌-న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య శుక్రవారం ప్రారంభం అయినా తొలి టెస్ట్‌ తొలి రోజుకి వ‌రుణుడు అడ్డుప‌డ్డ విషయం తెలిసిందే. టీ బ్రేక్ త‌ర్వాత వ‌ర్షం కురుస్తుండ‌డంతో.. మ్యాచ్‌కి కొనసాగడానికి కుదరలేదు. దీంతో అంపర్లు తొలి రోజ్కు ముగిసినట్టు ప్రకటించారు. ప్ర‌స్తుతం భార‌త్ ఐదు వికెట్ల న‌ష్టానికి 122 ప‌రుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. పృథ్వీ షా (16), చ‌టేశ్వ‌ర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), హ‌నుమ విహారి (7) వ‌రుసగా పెవిలియన్ చేరారు. ఓపెన‌ర్ మ‌యాంక్‌ అగ‌ర్వాల్ (34) మాత్రం కాస్త ఫ‌ర్వాలేద‌నిపించాడు.

<strong>పంత్‌కు ఇదే సరైన అవకాశం.. నిరూపించుకోకుంటే అంతే సంగతులు!!</strong>పంత్‌కు ఇదే సరైన అవకాశం.. నిరూపించుకోకుంటే అంతే సంగతులు!!

మంచి కామెంట్ పట్టండి:

మంచి కామెంట్ పట్టండి:

తొలి టెస్టు సందర్భంగా టాస్‌ వేసే సమయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఒక విచిత్రమైన స్టెప్‌ వేశాడు. భారత బ్లేజర్‌ ధరించి రెండు చేతులను చాచి డాన్స్‌ చేసాడు. దీనికి సంబందించిన ఫొటోను బీసీసీఐ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఫొటోకు మంచి కామెంట్లు పెట్టమని బీసీసీఐ అభిమానులను కోరింది. అంతేకాదు ఉత్తమ కామెంట్లను పోస్ట్ చేస్తాం అని పేర్కొంది.

కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయి:

కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయి:

బీసీసీఐ పోస్టుకు టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పదించాడు. కోహ్లీ ఫొటోకు హాస్యాస్పద కామెంట్‌ చేశాడు. 'విరాట్‌ కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయి' అని తనదైన శైలిలో కామెంట్‌ చేసాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన ఫొటోలో కోహ్లీ రెండు చేతులు చాచినట్లు కనిపిస్తుండగా.. వేళ్లు మాత్రం కిందకు వేలాడుతున్నట్లు ఉన్నాయి. దీంతో శ్రేయస్‌ అలా సరదాగా కామెంట్ పెట్టి అందరిని నవ్వించాడు. మరి అయ్యర్‌ పోస్ట్ బీసీసీఐకి నచ్చుతుందో లేదో చూడాలి. అయ్యర్‌ కామెంటును పోస్ట్ చేస్తే.. బీసీసీఐకి నచినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

N0.4 పరిష్కారం:

N0.4 పరిష్కారం:

శ్రేయస్‌ అయ్యర్‌ వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం మిడిల్ ఆర్డర్‌లో ఎంతో కీలక ఆటగాడిగా మారిపోయాడు. టీమిండియా టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉప్పట్టికీ.. కొంత కాలంగా టీ20, వన్డేల్లో N0.4 స్పాట్ సమస్య ఉండేది. కానీ ఇప్పుడూ ఆ సమస్య అయ్యర్ రూపంలో తీరినట్టే. రెండేళ్ల క్రితం జట్టులోకి అడుగుపెట్టిన అయ్యర్ నాలుగో నెంబర్ స్థానంలో రాణిస్తూ కీలకంగా మారాడు. ఈ మధ్య కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు.

2017లో న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపిక:

గత రెండేళ్ల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అయ్యర్ పరిణితి సాధించాడు. 2017 నవంబర్ నెలలో న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్‌ ఆ తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. సపారీలతో మూడు వన్డేలు ఆడిన తర్వాత జట్టుకు దూరమయ్యాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. ఈ మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్, లంక, ఆసీస్ సిరీస్‌లలో సత్తాచాటాడు. ఇక కివీస్ సిరిస్‌లో చితకొట్టాడు.

Story first published: Saturday, February 22, 2020, 5:42 [IST]
Other articles published on Feb 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X