న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఆసీస్: సిడ్నీ టీ20లో కోహ్లీసేన విజయంతో ఆ రికార్డు పదిలం

Australia vs India, 3rd T20I: India have never lost the third match of a bilateral T20I series

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు తన రికార్డుని పదిలం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

తాజా విజయంతో ఓ దైపాక్షిక టీ20 సిరిస్‌లో ఇప్పటివరకు ఆడిన మూడో టీ20లో టీమిండియాకు ఓటమన్నదే ఎదురు కాలేదు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20లో భారత్ ఓడిపోయింది.

ఆ తర్వాత మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైంది. ఇక, సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో కోహ్లీ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరిస్‌ను సమం చేసింది. తద్వారా ద్వైపాక్షిక టీ20 సిరిస్‌లో ఆఖరి టీ20లో విజయం సాధించి తన రికార్డుని మరింతగా మెరుగుపరచుకుంది.

1
43622

దైపాక్షిక టీ20 సిరిస్‌లో మూడో మ్యాచ్‌లో ఓటమెరుగని టీమిండియా:
* Bt Aus by 7 wkts, 2016
* Bt SL by 9 wkts, 2016
* Bt Zim by 3 runs, 2016
* Bt Eng by 75 runs, 2017
* Bt NZ by 6 runs, 2017
* Bt SL by 5 wkts, 2017
* Bt SA by 7 runs, 2018
* Bt Eng by 7 wkts, 2018
* Bt WI by 6 wkts, 2018

ఆదివారం జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్‌ (33), ఫించ్‌ (28), క్యారీ (27) రాణించగా చివర్లో స్టొయినిస్‌ (25 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది.

ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23), దినేశ్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 22 నాటౌట్‌) రాణించారు. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ లభించింది. ఇక, భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్‌ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 26, 2018, 13:49 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X