న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్‌కప్ 2019: అనిల్ కుంబ్లే No. 4 ఎవరో తెలుసా?

 After Australia debacle, Anil Kumble names India’s number four

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఓటమి వరల్డ్‌కప్‌లో టీమిండియాపై ప్రభావం చూపదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్‌ కుంబ్లే అన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 2-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంబ్లే మాట్లాడుతూ ద్వైపాక్షిక సిరీస్‌లతో పోలిస్తే వరల్డ్‌కప్ టోర్నీ పూర్తి భిన్నంగా ఉంటుందని కుంబ్లే చెప్పాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఏదైనా జట్టు ఫామ్ సాధించేందుకు గాను ఎక్కువ మ్యాచ్‌లు ఉన్నాయని కుంబ్లే అన్నాడు.

కోహ్లీ ఆడితే భారత్ వరల్డ్‌కప్ గెలుస్తుంది: పాంటింగ్ No. 4 ఎవరో తెలుసా?కోహ్లీ ఆడితే భారత్ వరల్డ్‌కప్ గెలుస్తుంది: పాంటింగ్ No. 4 ఎవరో తెలుసా?

కుంబ్లే మాట్లాడుతూ

కుంబ్లే మాట్లాడుతూ

అంతేకాదు.. ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో మిడిలార్డర్‌ మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేదని కుంబ్లే తెలిపాడు. ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ "రెండు మూడేళ్లుగా టీమిండియా విజయాలను పరిశీలిస్తే వాటిలో ఎక్కువగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా రాణించారు. 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో టాప్‌-3 కచ్చితంగా బాగా ఆడాల్సిందే" అని కుంబ్లే అన్నాడు.

నాలుగో స్థానంలో ధోని ఆడాలి

నాలుగో స్థానంలో ధోని ఆడాలి

"వారు ఆడకపోతే పరిస్థితి ఏంటి? ఈ మధ్యకాలంలో టాప్-3 రాణించడకపోవడంతోనే మిడిలార్డర్‌పై చర్చ జరుగుతోంది. నా వరకైతే ధోనీ నాలుగో స్థానంలో ఆడితే బాగుంటుంది. 5, 6, 7 గురించే ఆలోచించాలి. నాలుగో స్థానంలో ధోని ఆడతాడు కాబట్టి.. 4, 5, 6 స్థానాల్లో ఎవరాడాలన్నది పరిశీలించాలి. అందుకోసమే జట్టులో విపరీతమైన మార్పులు చేశారనిపిస్తోంది" అని కుంబ్లే అన్నాడు.

ఐపీఎల్‌లో 25-30 మంది ఆటగాళ్లు ఉంటారు

ఐపీఎల్‌లో 25-30 మంది ఆటగాళ్లు ఉంటారు

"ఐపీఎల్‌లో ఒక జట్టులో 25-30 మంది ఆటగాళ్లు ఉంటారు. ఒకటిరెండు మ్యాచ్‌ల్లో తుది జట్టులో ఉన్నవారు రాణించకపోతే మార్పులు చేస్తారు. కానీ వరల్డ్‌కప్‌లో జట్టులో 15 మందే ఉంటారు. వారి ప్రదర్శన బాగాలేకపోతే పరిస్థితి ఏంటన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎక్కువ మందిని పరిశీలించి ఉంటారు" అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు మరిన్ని అవకాశాలిస్తే బాగుండేది

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు మరిన్ని అవకాశాలిస్తే బాగుండేది

"మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు మరిన్ని అవకాశాలిస్తే బాగుండేది. కేఎల్‌ రాహుల్‌ ఒక మ్యాచే ఆడాడు. అంబటి రాయుడికి కొన్ని అవకాశాలే ఇచ్చారు. విజయ్‌ శంకర్ పర్వాలేదనిపించాడు. దినేశ్‌కార్తీక్‌, మనీశ్‌పాండే వైపు అసలు చూడనే లేదు. కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఐదు మ్యాచ్‌లు ఆడారని అనిపిస్తోంది" అని కుంబ్లే తెలిపాడు.

Story first published: Saturday, March 16, 2019, 18:23 [IST]
Other articles published on Mar 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X