న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్‌!!

Yusuf Pathan announces retirement from all forms of cricket

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్, బరోడా బ్యాట్స్‌మన్‌‌ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా యూసఫ్ శుక్రవారం ప్రకటించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు అయిన యూసుఫ్.. చివరిసారిగా 2012లో భారత్ తరఫున ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యూసఫ్.. 2012 తర్వాత ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్లు జట్టులోకి రావడంతో టీంలో చోటుదక్కించుకోలేకపోయాడు.

57 వన్డేలు, 22 టీ20లు:

57 వన్డేలు, 22 టీ20లు:

38 ఏళ్ల యూసుఫ్‌ పఠాన్ టీమిండియా తరఫున 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. 1046 పరుగులు, 46 వికెట్లు తీశాడు. 57 వన్డేలలో యూసుఫ్‌ రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 810 పరుగులు, 33 వికెట్లు తీశాడు. ఇక 22 టీ20లలో236 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు పడగొట్టాడు. 2007, 2011 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో యూసుఫ్‌ సభ్యుడు. ఐపీఎల్ ప్రాంఛైజీలు రాజస్థాన్ రాయల్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఛాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్‌ ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. 3204 పరుగులతో పాటు 42 వికెట్లు తీశాడు.

100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు:

100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు:

యూసుఫ్‌ పఠాన్‌ను గత చివరి రెండు ఐపీఎల్‌ సీజన్‌ వేలాల్లో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు దేశవాళీలో బరోడా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్‌.. 4825 పరుగులు చేసి 201 వికెట్లు తీశాడు. యూసఫ్ పఠాన్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ గత ఏడాది క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు సోదరులు కలిసి భారత్ ఓడిపోతుందనుకున్న ఓ మ్యాచును గెలిపిస్తారు. యూసుఫ్‌తో పాటు టీమిండియా మీడియం పేసర్‌ ఆర్‌ వినయ్‌ కుమార్‌ కూడా కొద్ది క్షణాల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి:

ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి:

తొలిసారి టీమిండియా జెర్సీ ధరించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని యూసుఫ్‌ పఠాన్‌ తన ట్వీట్లో పేర్కొన్నాడు. క్రికెట్ ఆడే అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, బరోడా క్రికెట్‌ అసోషియేషన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. 'ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అయితే ప్రపంచకప్‌, ఐపీఎల్‌ ఫైనల్‌ నేడు జరగట్లేదు. అయినా ఎంతో ముఖ్యమైనది. ఈ రోజుతో క్రికెట్‌‌కు నేను ముగింపు పలుకుతున్నా. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటిస్తున్నా. ఇప్పటివరకు నాలు మద్దుతుగా నిలిచిన నా దేశానికి, కుటుంబానికి, స్నేహితులు, అభిమానులు, కోచ్‌లకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇలానే ప్రోత్సహిస్తారనుకుంటున్నా' అని యూసుఫ్‌ అన్నాడు.

సచిన్‌‌ను భుజాలపై మోయడం మర్చిపోను:

సచిన్‌‌ను భుజాలపై మోయడం మర్చిపోను:

'నా క్రికెట్‌ కెరీర్‌లో అంతర్జాతీయ, దేశవాళీ‌, ఐపీఎల్ క్రికెట్‌ ఆడాను. ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియాకు, షేన్‌ వార్న్‌ కెప్టెన్సీలో ఐపీఎల్‌, జాకోబ్‌ మార్టిన్‌ నాయకత్వంలో రంజీ ట్రోఫీలో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాను. నాపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన వాళ్లకి ధన్యవాదాలు. గౌతమ్ గంభీర్‌ నాయకత్వంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టును రెండు సార్లు విజేతగా నిలిపాం. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడం సంతోషం. సచిన్‌‌ను భుజాలపై మోయడం నా కెరీర్‌లోని గొప్ప క్షణాలు. దాన్ని ఎప్పటికి మరువను. ఇక నా కెరీర్‌లో ఎదురైన అన్ని పరిస్థితుల్లోనూ అండగా నిలిచిన నా సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌కు కృతజ్ఞతలు' అని యూసుఫ్ పఠాన్‌ చెప్పాడు.

Story first published: Friday, February 26, 2021, 21:45 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X