ధోని ఫ్యాన్స్‌కు కోపం తెప్పించిన వృద్ధిమాన్ సాహా భార్య కోరిక

Posted By:

హైదరాబాద్: భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా భార్య కోరిక.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకి కోపం తెప్పించింది. బెంగాల్‌కు చెందిన వృద్ధిమాన్ సాహా కోల్‌కతాలో ఓ మ్యూజిక్ సీడీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు.

ఈ సందర్భంగా సాహా మీడియాతో మాట్లాడుతూ 2019 వరల్డ్ కప్‌ జట్టులో చోటు సంపాదించమని తన భార్య రోమీ నిత్యం తనను ప్రోత్సహిస్తూ ఉంటుందని చెప్పాడు. 'నా భార్య ఒక కోరిక కోరింది. రాబోయే వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున నన్ను ఆడాలని కోరింది' అని వెల్లడించాడు.

వన్డే జట్టులో చోటు

వన్డే జట్టులో చోటు

‘వన్డే జట్టులో స్థానం సంపాదించమని ఆమె నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తోంది. నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ.. తుది నిర్ణయం సెలక్టర్లే కదా!' అని 32 ఏళ్ల సాహా వెల్లడించాడు. అయితే ఇందులో సాహా భార్య రోమీ చేసిన తప్పేంటని అనుకుంటున్నారా?

టెస్టు క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత

టెస్టు క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత

టెస్టు క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా సాహా 28 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2014లో చివరి సారి లంకపై వన్డే మ్యాచ్‌ ఆడిన సాహా.. కెరీర్‌లో మొత్తం 9 వన్డేలాడి కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వన్డేల్లో సాహా అత్యధిక స్కోరు 16. ఇలాంటి బ్యాట్స్‌మెన్‌.. ధోనీ స్థానంలో రావాలనుకోవడం హాస్యాస్పదం అని అభిమానులు చురకలంటించారు.

ధోని స్ధానాన్ని సాహా భర్తీ చేశాడో

ధోని స్ధానాన్ని సాహా భర్తీ చేశాడో

మరో ఆరు నెలల్లో 2019 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే భారత జట్టుపై ఒక స్పష్టత వస్తుందని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఎలాగైతే ధోని స్ధానాన్ని సాహా భర్తీ చేశాడో... వన్డేల్లో కూడా అదే విధంగా భర్తీ చేయాలనేది సాహా భార్య కోరిక.

సాహా భార్య కోరికను గ్రహించిన ధోని అభిమానులు

సాహా భార్య కోరికను గ్రహించిన ధోని అభిమానులు

సాహా భార్య కోరికను గ్రహించిన ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ధోని లాంటి దిగ్గజ క్రికెటర్ స్ధానంలో తన భర్తని వరల్డ్ కప్ జట్టులో చూడాలనుకోవడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో ధోని మునుపటి ఫామ్ అందుకుని వరుస హాఫ్ సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, September 13, 2017, 15:10 [IST]
Other articles published on Sep 13, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి