న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ క్రికెట్‌కు 'దేవుడైతే', ధోని 'కింగ్ ఆఫ్ క్రికెట్': పుస్తకం రాయనున్న స్పిన్నర్

Sachin Tendulkar God But MS Dhoni King Of Cricket, Says Hong Kong off-spinner Ehsan Khan

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు దేవుడైతే, ధోని కింగ్ ఆఫ్ క్రికెట్ అని హాంకాంగ్ స్పిన్నర్ ఇహ్సన్ ఖాన్ కొనియాడాడు. ఇహ్సన్ ఖాన్.... హాంకాంగ్‌కు చెందిన ఈ స్పిన్నర్ మొన్నటి వరకు పెద్దగా ఎవరికి తెలియదు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనిని డౌకట్ చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.

అరంగేట్ర టెస్టులో సెంచరీ: ట్వీట్టర్‌లో పృథ్వీషా రికార్డుల మోత (ట్వీట్లు)అరంగేట్ర టెస్టులో సెంచరీ: ట్వీట్టర్‌లో పృథ్వీషా రికార్డుల మోత (ట్వీట్లు)

తాజాగా ఇహ్సన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో తాను 'కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌' అనే పుస్తకం రాయనున్నట్టు చెప్పాడు. "సచిన్‌ క్రికెట్‌ దేవుడైతే.. ధోని కింగ్‌ ఆఫ్‌ క్రికెట్‌. నా కెరీర్‌పై పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నా, ఈ పుస్తకంలో ధోని ఓ ప్రధాన చాప్టర్‌గా ఉండబోతున్నాడు" అని ఇహ్సన్ ఖాన్ తెలిపాడు.

 ఈ పుస్తకంలో ఎక్కువగా ధోని ప్రస్తావనే

ఈ పుస్తకంలో ఎక్కువగా ధోని ప్రస్తావనే

ఈ పుస్తకంలో ఎక్కువ భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్థావనే ఉంటుందని చెప్పాడు. "జీవితం అనేది ఫెయిర్ టేల్ కాబట్టి నా గ్రాండ్ సన్‌కు ఈ పుస్తకం చదివి వినిపిస్తా. ఈ పుస్తకంలో ధోని జీవిత విశేషాలు అద్భుతమైనవిగా ఉండబోతున్నాయి. వాటిని పుస్తక రూపంలోకి తెచ్చి.. భవిష్యత్‌ తరాలకు అందిస్తా" అని ఇహ్సన్ ఖాన్ చెప్పాడు.

హాంకాంగ్ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి సందడి

హాంకాంగ్ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి సందడి

కాగా, ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌పై టీమిండియా 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు హాంకాంగ్ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా ఇహ్సన్ ఖాన్ మాత్రం మోడ్రన్‌ క్రికెట్‌లో తన అభిమాన ఆటగాడు ధోనితో ముచ్చటించాడు. ధోని, రోహిత్‌లను ఔట్ చేసిన ఇహ్సన్ ఖాన్ ఓ స్కూల్‌ టీచర్‌ కావడం విశేషం.

65 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసిన ఇహ్సన్ ఖాన్

65 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసిన ఇహ్సన్ ఖాన్

ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన ఇహ్సన్ ఖాన్ 65 పరుగులిచ్చి 2 కీలక వికెట్లను పడగొట్టాడు. "ధోని అద్భుతమైన ఆటగాడు, క్రీడా విలువలు పాటించే ఆటగాడు. ధోనికి బౌలింగ్ వేశాక నాకు బంతి బ్యాట్‌కు తగిలిన శబ్దం రాలేదు. కానీ, కీపర్‌ అప్పీల్‌ చేస్తే నేను కూడా అరిచా. అంపైర్‌ కూడా ఆలోచనలో ఉండగానే.. ధోని పెవిలియన్‌ బాట పట్టాడు. ధోని వెనుదిరిగాక నీకు ఎలాంటి శబ్దమైనా వినిపించిందా అని అంపైర్‌ నన్ను అడిగాడు" అని చెప్పాడు.

 స్కూల్‌ పిల్లల ముందు నేను గర్వంగా నిలుచుంటా

స్కూల్‌ పిల్లల ముందు నేను గర్వంగా నిలుచుంటా

"ధోని నాకేం తెలియదని అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూసుంటే నాటౌట్‌గా ప్రకటించేవాడే. నిజాయితీగా ఆడే ధోని అంపైర్‌ తన నిర్ణయం ప్రకటించక ముందే వెనుదిరిగాడు. ఇది అసలైన క్రీడా స్పూర్తి. భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోని నాకు ఎన్నో సలహాలు, సూచనలు చేశాడు. అవి తనకెంతో ఉపయోగడతాయి. స్కూల్‌ పిల్లల ముందు నేను గర్వంగా నిలుచుంటా. ఆసియా కప్‌లో జరిగిన ఎన్నో విషయాలు నా స్టూడెంట్స్‌తో షేర్‌ చేసుకుంటా" అని అన్నాడు.

Story first published: Thursday, October 4, 2018, 15:16 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X