న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాన్స్ దొరికితే ధోనిలాగా మారిపోతా: పాక్ మాజీ కెప్టెన్ (వీడియో)

MS Dhoni Is My Favourite Indian Cricketer, Says Pakistans Sana Mir

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమాన ఆటగాడని పాకిస్థాన్ పరిమిత ఓవర్ల మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్‌ పేర్కొన్నారు. సనా మీర్ తాజాగా 'వాయిస్‌ ఆఫ్‌ క్రికెట్‌ షో' అనే షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఒక్కరోజు మన అభిమాన ఆటగాడిలా మారిపోయే అవకాశం దొరికితే నేనైతే.. గ్రేట్ కెప్టెన్లుగా పేరొం‍దిన ధోని, ఇమ్రాన్‌ ఖాన్‌లా లాగా మారిపోతా" అని తెలిపారు.

అభిమానించే

అంతేకాదు తాను అభిమానించే ఆటగాళ్లలో వీరిద్దరిదీ ప్రత్యేక స్థానమని ఆమె పేర్కొన్నారు. ఇక, తన కెరీర్‌ గురించి ప్రస్తావిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ బౌలర్‌గా ఎదగడం వెనుక జట్టులోని సహచర క్రీడాకారిణులు, కోచ్, సహాయక సిబ్బంది ప్రోత్సాహం మరువలేదని అన్నారు.

 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం

పాకిస్థాన్ మహిళా జట్టు టీ20, వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన సనా మీర్ ఇటీవలే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ బౌలర్‌ అయిన సనా మంగళవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు.

మొత్తం 212 వికెట్లు తీసిన సనా మీర్

వన్డే, టీ20ల్లో కలిపి 212 వికెట్లు తీసి, 663 పాయింట్లతో ఐసీసీ వుమన్‌ బౌలర్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్‌లో తన పట్ల అమితమైన ప్రేమను చూపుతున్న తల్లిదండ్రులు, ఫ్యామిలీ, స్నేహితులు, మెంటార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

నాలుగులో బ్యాటింగ్‌ అలవాటే: కోహ్లీ చేసిన వ్యాఖ్య వల్ల ఒత్తిడి లేదు

 2005లో పాక్ తరుపున అరంగేట్రం

2005లో పాక్ తరుపున అరంగేట్రం

32 ఏళ్ల సనా మీర్ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు తరుపున ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ సిరిస్‌లో పాల్గొంటోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో సనా 3/26, 1/37, 3/53 అద్భుత ప్రదర్శన చేసింది. పాక్ తరుపున సనా ఇప్పటివరకు 112 వన్డేలు, 90 టీ20 మ్యాచ్‌లాడింది.

Story first published: Wednesday, October 24, 2018, 12:28 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X