న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగులో బ్యాటింగ్‌ అలవాటే: కోహ్లీ చేసిన వ్యాఖ్య వల్ల ఒత్తిడి లేదు

India vs Westindies 2018 2nd Odi:Virat Kohli's Descion Doesnt Surprise Me:Ambati Rayudu | Oneindia
Ambati Rayudu confident of performing at number four for India, says not new to middle-order

హైదరాబాద్: మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని భారత క్రికెటర్‌ అంబటి రాయుడు తెలిపాడు. భారత జట్టులో కీలకమైన నాలుగో స్థానంలో కొంతకాలంగా పలువురు ఆటగాళ్లను మేనేజ్‌మెంట్‌ పరీక్షిస్తోన్న సంగతి తెలిసిందే. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడిని మేనేజ్‌మెంట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించింది.

<strong>మరోసారి పరాజయానికి గురైన తెలుగు టైటాన్స్</strong>మరోసారి పరాజయానికి గురైన తెలుగు టైటాన్స్

దీంతో నాలుగో స్థానంలో ఆడటం తనకు అలవాటేనని రాయడు చెప్పుకొచ్చాడు. రెండో వన్డేకి ముందు మీడియాతో అంబటి రాయుడు మాట్లాడుతూ "చాలా కాలంగా నేను నాలుగో స్థానంలో ఆడుతున్నాను. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆ స్థానంలో ఆడమని చెప్పడంలో కొత్తేమీ లేదు. నేను నాలుగో స్థానానికి సరైన వాడినంటూ కెప్టెన్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్య వల్ల ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదు" అని అన్నాడు.

ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను

ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను

"అదేమీ అదనపు బాధ్యత కాదు. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను. అంతకుమించి భవిష్యత్‌ గురించి ఆలోచించడం లేదు. నేను కేవలం నా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టి సాధించాను. యోయో టెస్ట్‌ గురించి కూడా అంతగా ఆలోచించలేదు. ఐపీఎల్‌ నాకు మంచి అవకాశం ఇచ్చింది. నేనేంటో నిరూపించుకునేలా చేసింది. ఇక మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే" అని అంబటి రాయుడు తెలిపాడు.

ఆసియా కప్‌లో రాణించిన రాయుడు

ఆసియా కప్‌లో రాణించిన రాయుడు

ఆసియా కప్‌లో రాణించిన రాయుడు, అంతకుముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా యో-యో టెస్టులో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే నిర్దేశిత ఫిట్‌నెస్‌ ప్రమాణాలకు తానేమీ వ్యతిరేకం కాదని రాయుడు వెల్లడించాడు. "నేను యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించడం సంతోషమే. అయితే ఈ టెస్టుకు, నా ఫిట్‌నెస్‌ సన్నద్ధతకు ఎలాంటి సంబంధం లేదు" అని అన్నాడు.

భారత టాప్‌-3 అద్భుతంగా రాణిస్తోంది

భారత టాప్‌-3 అద్భుతంగా రాణిస్తోంది

"భారత టాప్‌-3 అద్భుతంగా రాణిస్తుండటం గొప్ప విషయం. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ కూడా ఎప్పుడు ఏ సవాల్‌ ఎదురైనా బాగా బ్యాటింగ్‌ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. నాకు తెలిసి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జట్టులో పరిస్థితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. సిరీస్‌లో ఒక్కటే మ్యాచ్‌ ముగిసింది. తర్వాతి మ్యాచ్‌లలో విండీస్‌ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నా" అని రాయుడు తెలిపాడు.

జింబాంబ్వేపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన అంబటి రాయుడు

జింబాంబ్వేపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన అంబటి రాయుడు

2001-02లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడటం ప్రారంభించిన అంబటి రాయుడు.... 28 ఏళ్ల వయసులో 2013తో జింబాంబ్వేపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. వరల్డ్‌కప్ సన్నాహకంలో భాగంగా గతకొంత కాలంగా భారత జట్టు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ పరీక్షిస్తోన్న సంగతి తెలిసిందే. మూడు, నాలుగు స్థానాలపై దృష్టి సారించిన జట్టు మేనేజ్‌మెంట్ దానికి రాయుడే సరైన వాడని భావించి అవకాశం కల్పించింది.

వరకు జట్టులో కొనసాగే అవకాశం

వరకు జట్టులో కొనసాగే అవకాశం

ఈ సిరీస్‌లో గనుక రాయుడు రాణిస్తే వరల్డ్‌కప్ వరకు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వెస్టిండిస్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. సిరిస్‌లో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

Story first published: Wednesday, October 24, 2018, 12:16 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X