న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బర్త్‌డే బాయ్ మహేంద్ర సింగ్ ధోనీ టాప్-10 రికార్డ్స్

MS Dhoni Birthday: A look at top ten records held by the India legend

మారుమూల చిన్న పట్టణం.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. కావల్సినంత ప్రతిభ.. అవకాశాలు పరిమితం.. కష్టాలు అపరిమితం.. కుటుంబ బాధ్యతలు.. తండ్రి పడుతున్న కష్టాలు.. క్రికెట్‌ కెరీర్‌ కొనసాగించాలా.. ఉద్యోగంలో కొనసాగాలా.. ఇలాంటి పరిస్థితి నుంచి భారతీయ క్రికెట్‌లో తారజువ్వలా దూసుకొచ్చిన ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ.!

టీ20 ప్రపంచకప్‌.. వన్డేప్రపంచకప్‌.. చాంపియన్స్‌ ట్రోఫీ..అన్ని ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. విజయాన్ని అందరి ఖాతాలో వేసి.. అపజయాన్ని తన ఖాతాలో వేసుకునే గొప్ప దార్శనికుడు. భారత క్రికెట్‌ గతిని మార్చి.. కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన డైనమైట్‌. అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందించిన మహేంద్రుడు నేడు 39వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ లెజెండ్‌కు శుభాకాంక్షలు తెలుపుతుంది. అతని చిర్మసర్మనీయ ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మహీ టాప్-10 రికార్డ్స్ గురించి ఓ లుక్కెద్దాం.!

ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథి..

ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథి..

క్రికెట్ ప్రపంచంలోనే తనదైన సారథ్యంతో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఈ రాంచీ డైనమైట్.. ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. యువ క్రికెటర్‌గానే 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన మహీ.. మూడు దశాబ్దాలుగా ఊరించిన ప్రపంచకప్‌ను 2011లో అందించి యావత్ భారతం ఉప్పొంగేలా చేశాడు. అనంతరం 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథిగా చరిత్రకెక్కాడు.

అత్యధిక మ్యాచ్‌ల రికార్డు..

ఇక క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఘనతను ధోనీ అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌లకు మహీ కెప్టెన్సీ వహించాడు. ధోనీ తర్వాతి స్థానంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లు) ఉన్నాడు.

అత్యధిక విజయాల కెప్టెన్

అత్యధిక విజయాల కెప్టెన్

ఇక భారత్ తరఫున అత్యధిక విజయాలందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌ల్లో 178 విజయాలందించాడు. ఇక అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన ఘనతను అందుకున్నాడు.

అత్యధిక సిక్స్‌ల వీరుడు

పవర్ హిట్టర్‌గా అభిమానులకు సుపరిచితమైన ధోనీ.. అలవోక సిక్సర్లతో వారిని అలరించేవాడు. హెలికాఫ్టర్ షాట్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన మహీ వన్డేల్లో ఇప్పటి వరకు 204 సిక్స్‌లు బాదాడు. దీంతో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

ఐపీఎల్‌లోనూ రికార్డుల మోత

ఐపీఎల్‌లోనూ రికార్డుల మోత

భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ మహేంద్రుడి హవా కొనసాగింది. అతని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ అందుకుంది. చాంపియన్స్ లీగ్‌లోరెండు సార్లు విజేతగా నిలిచింది. ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో 174 మ్యాచ్‌ల్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై 104 విజయాలందుకుంది. ఫలితంగా అత్యధిక విజయాలందించిన కెప్టెన్‌గా ధోనీకి ఘనత దక్కింది.

కీపర్‌గా వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్..

వన్డే ఫార్మాట్‌లో వికెట్ కీపర్ల జాబితాలో ధోనీదే వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్. 2005లో శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేశాడు. ఫలితంగా అప్పటి వరకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉన్న రికార్డు బద్దలయింది.

సిక్సర్‌తో ప్రపంచకప్ అందించిన ఏకైక ప్లేయర్..

ఇక క్రికెట్ చరిత్రలోనే సిక్సర్‌తో ప్రపంచకప్ అందించిన ఏకైక ఆటగాడు ధోనీనే కావడం విశేషం. శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో ఆ జట్టు బౌలర్ నువాన్ కులశేఖర్ వేసిన మూడో బంతిని ధోనీ సిక్స్‌గా మలిచి 28 ఏళ్ల భారత కలను సాకారం చేశాడు.

అత్యధిక స్టంపౌట్లు..

అత్యధిక స్టంపౌట్లు..

రెప్పపాటులో స్టంపింగ్స్ .. వికెట్లను చూడకుండానే రనౌట్లు.. చిరుతలాంటి వేగం కలిగిన ధోనీ కీపర్‌గా కూడా అద్భుత రికార్డులు అందుకున్నాడు. మూడు ఫార్మాట్లో కలిపి 538 మ్యాచ్‌ల్లో కీపింగ్ చేసిన ధోనీ 195 స్టంపౌట్లతో ఈ ఘనతనందుకున్న వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. ధోనీ తర్వాత కుమార సంగక్కర(594 మ్యాచ్‌లు..139 స్టంపౌట్లు) ఉన్నాడు.

విజయవంతమైన భారత కీపర్..

మొత్తం 829 ఔట్లలో పాలుపంచుకున్న మహీ.. వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్‌గా నిలిచాడు. ఇందులో 195 స్టంపౌట్లు, 634 క్యాచ్‌లు ఉన్నాయి. మరే భారత వికెట్ కీపర్ కనీసం 500 ఔట్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయారు. ధోనీ కీపింగ్ సగటు.. 1.363.

భారత్ కెప్టెన్‌గా మోస్ట్ రన్స్

ఇక వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ధోనీ ఘనతను అందుకున్నాడు. 200 వన్డేల్లో 53.56 సగటులో 6641 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో రికీ పాంటింగ్ ముందుండగా... ధోనీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, July 7, 2020, 14:26 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X