న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డీఆర్ఎస్‌లో తిరుగులేని ధోనీ.. కుల్దీప్‌కు దక్కిన మరో వికెట్

Kuldeep Yadavs six-wicket haul sets up India win

హైదరాబాద్: డీఆర్‌ఎస్‌లో తిరుగులేదన్న పేరును ధోనీ మళ్లీ సాకారం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ విజయానంతరం టీమిండియా వన్డే సిరీస్‌లో శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ మొత్తంలో కుల్దీప్ మళ్లీ చెలరేగి ఆడటంతో తొలి టీ20 మ్యాచ్‌లో తీసినట్లుగానే తొలి వన్డేలో సైతం 5వికెట్లను తీసి అందరినీ ఔరా అనిపించాడు.

Kuldeep Yadav Produces Career Best Figures India Against English
 ఉమేష్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చిన రాయ్:

ఉమేష్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చిన రాయ్:

బౌలింగ్‌కు దిగిన తొలి ఓవర్ రెండో బంతికే దూకుడు మీదున్న జాసన్ రాయ్ (35 బంతుల్లో 38)ను ఈ మణికట్టు స్పిన్నర్ బోల్తా కొట్టించాడు. కుల్దీప్ విసిరిన తొలి బంతిని స్వీప్ షాట్ ఆడి రెండు పరుగులు తీసిన రాయ్.. రెండో బంతిని కూడా స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించాడు. రాయ్ స్వీప్ షాట్లు ఆడటాన్ని గమనించిన కోహ్లి లెగ్ స్లిప్‌లో ఫీల్డర్‌ను ఉంచాడు. దీంతో రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించిన రాయ్.. కోహ్లి-కుల్దీప్ ఉచ్చులో చిక్కాడు. ఉమేష్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

 ధోనీ సాయంతో.. రూట్‌ (3)ను ఎల్బీగా:.

ధోనీ సాయంతో.. రూట్‌ (3)ను ఎల్బీగా:.

13 ఓవర్లో తొలి బంతికే కుల్దీప్.. రూట్‌ (3)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్ ఐదో బంతికి బెయిర్‌స్టోను కూడా ఎల్బీగా అవుట్ చేశాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ధోనీ సూచనతో రివ్యూ కోరిన కోహ్లి విజయం సాధించాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టో (38) అవుటవడంతో ఇంగ్లాండ్ 9 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయింది.

11 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి

11 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీసి

ఇలా తొలి వన్డేలోనూ తన మ్యాజిక్‌ను ప్రదర్శించి కుల్దీప్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ను కుల్దీప్ దెబ్బతీశాడు. 11 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.

 ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్

బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్ మీద 11 బంతుల్లో మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. కుల్దీప్‌ను తప్పకుండా ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో ఆడించాలని సూచించాడు.

Kuldeep Yadavs six-wicket haul sets up India win
Story first published: Tuesday, July 17, 2018, 16:22 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X