న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: CSK vs MI: ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే ముంబై గెలవాల్సిందే!

IPL 2019: Match 44, CSK vs MI Match Prediction: Who will win todays match?

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి చెపాక్‌లోని ఎమ్ఎ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌ను సీఎస్‌కే ఘనంగా ప్రారంభించింది. మొదటి 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచింది. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మంగళవారం సొంతగడ్డపై సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు షేన్ వాట్సన్ 96 పరుగులతో చెలరేగి ఆడటంతో చెన్నై విజయం సాధించింది.

గత మ్యాచ్‌లో ఓడిన ముంబై

గత మ్యాచ్‌లో ఓడిన ముంబై

మరోవైపు ముంబై గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ... వరుసగా ఏడు మ్యాచ్‌లాడగా అందులో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలోకి ఎగబాకింది. అంతేకాదు సీఎస్‌కే మొదట ఆడిన ఎనిమిది గేముల్లో ఓడింది ముంబై ఇండియన్స్ చేతిలోనే కావడం విశేషం. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

చెన్నై తొలుత బ్యాటింగ్ చేస్తే

చెన్నై తొలుత బ్యాటింగ్ చేస్తే

చెన్నై బ్యాటింగ్ లైనప్ ఏమంత గొప్పగా లేదు. అయితే, టాపార్డర్‌లో ఒక ఆటగాడు చెలరేగడంతో విజయాలను సాధిస్తుంది. సన్‌రైజర్స్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో షేన్ వాట్సన్ పరుగులు వరద పారించాడు. 96 పరుగులు చేయడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా డుప్లెసిస్, అంబటి రాయుడు, సురేశ్ రైనా ఆశించిన మేరకు రాణించడంలేదు. అయితే, ధోని ఈ సీజన్‌లో ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొస్తుంది. చెపాక్ స్టేడియం బౌలర్లకు అనుకూలిస్తుండటంతో చెన్నై 160 పరుగులు చేసే అవకాశం ఉంది.

ముంబై తొలుత బ్యాటింగ్ చేస్తే

ముంబై తొలుత బ్యాటింగ్ చేస్తే

ఈ సీజన్‌లో ముంబై సమిష్టిగా రాణించడంతో విజయాలను అందుకుంటోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు ఆశించిన స్థాయిలో రాణించడంలేదు. అయితే, ఓపెనర్ క్వింటన్ డీకాక్ ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో డీకాక్ మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు మిడిలార్డర్‌లో కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు ఆ జట్టుకు బలం. హార్దిక్ పాండ్యా అయితే చెలరేగి ఆడుతున్నాడు. ఈ నేపధ్యంలో ముంబై తొలుత బ్యాటింగ్ చేస్తే 170 పరుగులు చేసే అవకాశం ఉంది.

ముంబై, చెన్నై జట్లలో నెగ్గేదెవరు?

ముంబై, చెన్నై జట్లలో నెగ్గేదెవరు?

చెన్నై 16 పాయింట్లతో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుంది. ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే, చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండటంతో సీఎస్‌కే ఫేవరేట్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చెపాక్ వేదికగా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

Story first published: Friday, April 26, 2019, 16:56 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X