న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : తొలి వన్డేలో కూడా భారీ స్కోర్లు.. టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేస్తే బెటర్?

 Hyderabad is hosting first INDvsNZ ODI. What weather and pitch should we expect here.

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. న్యూజిల్యాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధం అయింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. శ్రీలంకతో చివరి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ మరోసారి అలాగే సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే తనకు దక్కిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయిన రోహిత్ కూడా ఈ సారి ఫామ్ అందుకోవడానికి తహతహలాడుతున్నాడు.

హైదరాబాద్ వేదికగా జరిగే తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఏమాత్రం లేదు. వాతావరణం క్రికెట్‌కు చక్కగా అనుకూలిస్తుందని తెలుస్తోంది. దీంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత అత్యధికంగా 29 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది. సాయంత్రం అయ్యే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సాయంత్రం మంచు ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందా? లేదా? అంటే మరీ అంతగా లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

రాజీవ్ గాంధీ స్టేడియంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకే అనుకూలిస్తుంది. దీంతో ఈమ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే బౌలర్లు కూడా పెద్దగా నిరాశ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్పిన్నర్లకు ఈ పిచ్ నుంచి కొంత సహకారం లభిస్తుందట. అయితే పేసర్లు మాత్రం ఈ పిచ్‌పై పెద్దగా రాణించలేరని తెలుస్తోంది. వీళ్లకు పిచ్ నుంచి పెద్దగా మద్దతు ఉండదు. దీంతో ఎక్కువగా స్లో బాల్స్ పై ఆధారపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు స్పిన్నర్లు, స్లో బాల్స్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న టీమిండియా టాపార్డర్ ఎలా ఆడుతుందో చూడాలి. అందరి కళ్లూ ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ మీదనే ఉన్నాయి. రాహుల్ లేకపోవడం ఇషాన్ కిషన్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తారని సమాచారం.

Story first published: Wednesday, January 18, 2023, 8:13 [IST]
Other articles published on Jan 18, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X