న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. పచ్చి తాగుబోతు' (వీడియో)

Indian fans troll Ravi Shastri calling him an alcoholic on his promotional post

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి తెలిసో తెలియకో గానీ, నెగిటివ్ పబ్లిసిటీ బాగానే వస్తోంది. ప్రస్తుతం అతణ్ని తాగుబోతు అంటూ నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. అనిల్ కుంబ్లేకు రవిశాస్త్రికీ మధ్య తేడా ఇదేనంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే, తాజాగా రవిశాస్త్రి ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోపైనే నెటిజన్లు పలురకాలుగా స్పందించారు.

ప్రస్తుతం కోహ్లీ సేనతో కలిసి రవిశాస్త్రి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఇంగ్లాండ్‌లో ఇప్పుడు వేసవికాలం కావడంతో ఆటగాళ్లు అక్కడి వేడికి ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఓ ఎనర్జీ డ్రింక్‌ను ప్రమోట్‌ చేసేందుకు ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ రోజు లండన్‌లో చాలా వేడిగా ఉంది. ఈ డ్రింక్‌ తాగి వేడి నుంచి ఉపశమనం పొందండి' అంటూ కామెంటేటర్ స్టైల్‌లో మాట్లాడుతూ కళ్లకు అద్దాలతో తలపై టోపీ పెట్టుకుని ఉన్న వీడియోను పంచుకున్నాడు.

ఆగష్టు 6వ తేదీ పంచుకున్న ఈ వీడియోపై భారత అభిమానులు ఇంకా మండిపడుతూనే ఉన్నారు. 'లార్డ్స్‌ టెస్టులో ఎలా గెలవాలన్న దానిపై టీమిండియాకు మొదట సలహాలు ఇవ్వు' 'అనిల్‌కుంబ్లే-రవిశాస్త్రి మధ్య తేడా ఏంటో అర్థమైందా' 'రవిశాస్త్రి.. ఆల్కహాలిక్‌... సేల్స్‌ బాయ్‌' 'కోచ్‌గా అసలు రవిశాస్త్రి జట్టు కోసం ఏం చేస్తున్నాడు? మొన్న మ్యాచ్‌ జరిగే సమయంలో నిద్రపోతూ కనిపించాడు.. ఇప్పుడేమో ఇలా ప్రమోషనల్స్‌' అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానికి తగ్గట్లుగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ మధ్య జరిగిన బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో రవిశాస్త్రి గురించి మాట్లాడాడు. శాస్త్రిని ఉదయం సమయంలో ఇంటర్వ్యూ చేయకండి. అతనికేం గుర్తుండదు. మీకు కావాలంటే సాయంత్రం వేళల్లో చేయండి. అయినా ఈ సారి కలిసినప్పుడు చెప్తా. అతనికి బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో ఏం మాట్లాడాలో అనే విషయంపై అంటూ చమత్కరించాడు. దీంతో అతనిపై ఈపాటికే ఓ అభిప్రాయం వచ్చేసింది సగటు అభిమానులందరికీ.

Story first published: Wednesday, August 8, 2018, 15:18 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X