న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

18వ ఓవర్లో భువీ అద్భుతం: తొలి టీ20లో భారత్ ఘన విజయం

By Nageshwara Rao
India vs South Africa 1st T20 Highlights, India Won By 28 Runs
Bhuvi

హైదరాబాద్: జోహెన్నస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే కుప్పకూలింది. ఛేజింగ్‌కు అనుకూలించే పిచ్ మీద కోహ్లి సేన చరిత్ర సృష్టించింది.

ఇన్నింగ్స్ 18వ ఓవర్లో భువీ హ్యాట్రిక్ దెబ్బకు సఫారీలు చిత్తయ్యారు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను హెండ్రిక్స్ (70), ఫర్హాన్ బెహర్డీన్ (39) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బెహర్డీన్‌ను చాహల్ తన స్పిన్ మాయతో పెవిలియన్‌కు చేర్చాడు.

దీంతో సఫారీ జట్టు 15 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఆ తర్వాత సఫారీలు దూకుడుగ ఆడుతున్న సమయంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన భువీ.. తొలి బంతికే హెండ్రిక్స్‌ (70)ను పెవిలియన్‌కు చేర్చాడు. నాలుగు, ఐదు బంతుల్లో క్లాసేన్‌ (7 బంతుల్లో 16), మోరీస్ (0)ను ఔట్ చేశాడు.

చివరి బంతికి ప్యాటెర్‌సన్‌ను పాండ్యా, ధోని రనౌట్ చేయడంతో భువీ హ్యాట్రిక్ సాధించాడు. ఒకే ఓవర్లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, చాహల్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఫిబ్రవరి 21 (బుధవారం) సెంచూరియన్ వేదికగా జరగనుంది.


Dhawan

ధావన్ హాఫ్ సెంచరీ, సఫారీల విజయ లక్ష్యం 204

జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టీ20లో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20 లైవ్ స్కోరు కార్డు

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, జోహన్నెస్‌బర్గ్‌లో ఇప్పటి వరకు ఓ టీ20 మ్యాచ్‌లో ఛేజింగ్‌కు దిగిన జట్టు ఇప్పటివరకు ఓడిపోలేదు. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 232 పరుగులు చేశారు.

అనంతరం చేధనకు దిగిన వెస్టిండిస్ భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ (9 బంతుల్లో 21; 2 సిక్సులు, 2 ఫోర్లు) భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. అయితే జూనియర్ డాలా వేసిన బౌన్సర్‌కు రోహిత్ శర్మ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (7 బంతుల్లో 15; ఒక సిక్సు, 2 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దూకుడుగా ఆడే క్రమంలో జూనియర్ డాలా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరవాత ఓపెనర్ శిఖర్ ధావన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (20 బంతుల్లో 26; ఒక సిక్సు, 2 ఫోర్లు)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలో ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మనీష్ పాండే (27 బంతుల్లో 29 నాటౌట్; ఒక సిక్సు)తోనూ నాలుగో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని ధావన్ నెలకొల్పాడు. దూకుడుగా ఆడుతున్న ధావన్‌ను ఫెహ్లుకోవాయో పెవిలియన్‌కు చేర్చాడు.

దీంతో జట్టు స్కోరు 155 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఇక ఆఖరి ఐదు ఓవర్లలో ధోనీ (16), హార్దిక్ పాండ్యా (13) పాండే (29) పరుగులతో ఫరవాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో జూనియర్ డాలా 2, క్రిస్ మోరిస్, షంసీ, ఫెహ్లక్వేయో తలో వికెట్ తీశారు.


పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 78/2
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా దూకుడుగా ఆడుతున్నారు. పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (30), విరాట్ కోహ్లీ (9) పరుగులతో ఉన్నారు.


5 ఓవర్లకు భారత్ 60/2
దక్షిణాఫ్రికా జరుగుతోన్న తొలి టీ20లో టీమిండియాకు ఓపెనర్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని అందించాడు. డేన్ పటెర్సన్ వేసిన తొలి ఓవర్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఏకంగా 18 పరుగులు రాబట్టారు. తొలి ఓవర్‌లో 17 పరుగులు రోహిత్‌వే. తొలి ఓవర్‌లోనే 2 సిక్సులు, 1 ఫోర్‌తో 18 పరుగులు రాబట్టాడు. రెండో ఓవర్‌లోనూ ఇదే జోరు కొనసాగించాడు. రెండో ఓవర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మరో సిక్స్ బాదిన రోహిత్ శర్మ(21) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్లాసెన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

కీపర్ అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. కానీ దక్షిణాఫ్రికా రివ్యూ కోరుకోవడంతో రోహిత్ ఔట్‌గా తేలింది. దీంతో భారత్ 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఏడాది తర్వాత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న సురేశ్ రైనా దూకుడగా ఆడాడు. 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సుతో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్ (19), కోహ్లీ (3) పరుగులతో ఉన్నారు.


కోహ్లీసేన బ్యాటింగ్:
జోహెన్స్ బర్గ్ వేదికగా భారత జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. సుమారు ఏడాది తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా జట్టులోకి తిరిగొచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా జేపీ డుమిని వ్యవహరిస్తున్నాడు.

దక్షిణాఫ్రికా జట్టుకు చివరి నిమిషంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఏబీ డివిలియర్స్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరోవైపు, భారత జట్టు ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్‌ గాయం కారణంగా దూరం కావడంతో ఉనాద్కత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

ఇక, అయ్యర్ స్థానంలో మనీష్ పాండే టీమ్‌లోకి వచ్చాడు. భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టులో చేరాడు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 5-1తో గెలుచుకున్న కోహ్లీసేన టీ20 సిరీస్‌పైనా కన్నేసింది. మరోవైపు సఫారీలు వన్డేల్లో ఎదురైన ఘోర పరాభవానికి టీ20 సిరిస్‌ను నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు.


జట్ల వివరాలు:
భారత్:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, ధోని, భువనేశ్వర్‌ కుమార్‌, ఉనాద్కత్‌, చాహల్‌, బూమ్రా

దక్షిణాఫ్రికా:
జేపీ డుమినీ(కెప్టెన్‌), డేవిడ్‌ మిలర్ల్‌, బెహర్దియన్‌, హెండ్రిక్స్‌, స్మట్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, క్రిస్‌ మోరిస్‌, ఫెహ్లుకోవాయో, డేన్‌ పాటర్సన్‌, జూనియర్‌ డాలా, షంసీ

Story first published: Sunday, February 18, 2018, 22:19 [IST]
Other articles published on Feb 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X