న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త సంవత్సరంలో చర్చలు: డీడీసీఏ అధ్యక్షుడిగా గౌతమ్ గంభీర్?

 DDCA officials want Gautam Gambhir to take over as president


హైదరాబాద్: ఢిల్లీ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయిందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. డీడీసీఏ అధ్యక్షుడిగా రజత్ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవికి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.

తాజాగా డీడీసీఏలో వర్గపోరు తారాస్థాయి చేరి, ఒక వర్గం సభ్యులు మరో వర్గం వారిపై పిడిగుద్దులు కురిపించుకునే వరకు వెళ్లింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒక వర్గం సభ్యులు ఓ ప్రతిపదనను తీసుకురాగా దాన్ని మరోవర్గం వారు వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల సభ్యులు గొడవకు దారితీసింది.

Yearend 2019: తొలి షట్లర్‌గా మొమోటా, సూపర్ డాడీస్, ప్రపంచ ఛాంపియన్‌గా సింధుYearend 2019: తొలి షట్లర్‌గా మొమోటా, సూపర్ డాడీస్, ప్రపంచ ఛాంపియన్‌గా సింధు

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీడీసీఏను రద్దు చేయాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని ట్విట్టర్ వేదికగా కోరాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెంటనే చర్యలు తీసుకొని, డీడీసీఏను రద్దు చేయాలని గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ వీడియోలో డీడీసీఏ జాయింట్‌ సెక్రటరీ రాజన్‌ మంచందతో పాటు మరికొందరు సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 13లోపు డీడీసీఏకు నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ పదవికి గంభీరే అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు.

అధ్యక్ష పదవిని గంభీర్ చేపడితే డీడీసీఏ గాడినపడుతుందని చెప్పుకొచ్చారు. "ఐపీఎల్‌లో కేకేఆర్ యొక్క అదృష్టాన్ని మార్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీ క్రికెట్‌కు గంభీర్ చేసిన సహకారాన్ని మర్చిపోకూడదు. నాయకత్వ లక్షణాలతో పాటు నిర్వాహకుడిగా మారిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆకట్టుకోవడాన్ని మనం చూశాం, ఈ సమయంలో డీడీసీఏ పగ్గాలు చేపట్టడానికి గంభీర్ సరైన వ్యక్తి" అని అన్నాడు.

<strong>టెన్నిస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఆండీ ముర్రే</strong>టెన్నిస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఆండీ ముర్రే

"నిన్నటి గొడవ తర్వాత కొంతమంది బీజేపీ అఫీసియల్స్ ఈ మధ్య కాలంలో అసోసియేషన్‌లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి గంభీర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. నిన్నటి ఘటన తర్వాత అతనిలాంటి కఠినమైన టాస్క్‌మాస్టర్ బాధ్యతలు స్వీకరించి అసోసియేషన్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురాగలడు. అవును, మేము ఇప్పటివరకు జరిపిన చర్చలపై అతడు కూడా ఆసక్తి చూపించాడు. కొత్త సంవత్సరంలో అతనితో మరో సమావేశం జరుగుతుందని భావిస్తున్నాం" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Story first published: Monday, December 30, 2019, 17:21 [IST]
Other articles published on Dec 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X