రెంటో టీ20: ఓటమికి కోహ్లీ చెప్పిన కారణం

Posted By:

హైదరాబాద్: మా స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేకపోవడం వల్లే రెండో టీ20లో ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. గువహటి వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడాడు. 'మాకు మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ చేయలేకపోయాం. క్రీజులో కుదురుకొనేందుకు కొద్దిసేపైనా వికెట్లను అంటిపెట్టుకొని ఉండాల్సింది. కానీ అనుకున్న పని చేయలేకపోయాం' అని కోహ్లీ అన్నాడు.

120 శాతం కష్టపడాలి

120 శాతం కష్టపడాలి

'పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మేము గ్రౌండ్‌లో 120 శాతం కష్టపడాలి. దానికోసం జట్టు మొత్తం కట్టుబడి ఉంది. ఈ రోజు ఆస్ట్రేలియా మాకంటే ఎంతో బాగా ఆడింది. మేము బ్యాటింగ్‌లో విఫలమయ్యాం' అని కోహ్లీ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఆడిన రెండో టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్ బౌలర్ జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ను కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు.

4 ఓవర్లు.. 21 పరుగులు, నాలుగు వికెట్లు

4 ఓవర్లు.. 21 పరుగులు, నాలుగు వికెట్లు

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. 'రోహిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాడు. రోహిత్ ఎదుర్కొన్న బంతి అద్భుతం. సరైన సమయంలో సరైన ప్రాంతంలో షాట్లు కొట్టడం అతనికి సాధ్యం. అయితే ఇక్కడ క్రెడిట్ బెహ్రెన్‌డార్ఫ్‌కి ఇవ్వాలి. అతడి లైన్‌ అండ్‌ లెన్త్‌ ఆటతీరు మమ్మల్ని ఆలోచింప చేస్తుంది' అని కోహ్లీ అన్నాడు.

 అనుకున్న ప్రణాళికను సరిగ్గా అమలు చేశాం

అనుకున్న ప్రణాళికను సరిగ్గా అమలు చేశాం

ఇక ఆసీస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ అనుకున్న ప్రణాళికను సరిగ్గా అమలు చేయడం ద్వారా రెండో టీ20లో విజయం సాధించామని చెప్పాడు. బెహ్రెన్‌డార్ఫ్‌ బంతితో బౌన్స్‌ను రాబట్టగలిగాడని, ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని మెచ్చుకున్నాడు.

హైదరాబాద్‌ అభిమానులు మద్దతు తమకే

హైదరాబాద్‌ అభిమానులు మద్దతు తమకే

హెన్రిక్స్‌ సన్‌రైసర్స్‌ హైదరాబాద్ తరపున ఆడినప్పటి నుంచి మైదానంలో మంచి ప్రతిభ కనపరుస్తున్నాడని కొనియాడాడు. ప్రారంభంలో పిచ్‌ ఇంగ్లండ్‌ తరహా పిచ్‌ను పోలి ఉందని, సిరీస్‌ ఎవరిదో తేల్చే చివరి మ్యాచ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరుగుతుండటంలో, హైదరాబాద్‌ అభిమానులు తమకు మద్దతునిస్తారని వార్నర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, October 11, 2017, 11:19 [IST]
Other articles published on Oct 11, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి