న్యూజిల్యాండ్‌తో మూడో వన్డే సమయంలో నెంబర్ వన్ వన్డే ర్యాంకు గురించి తాము పెద్దగా ఆలోచించడం లేదని టీమిండియా సారధి రోహిత్ శర్మ చెప్పాడు. తాము బిగ్ పిక్చర్ చూస్తున్నామని, ఇలాంటి పిచ్‌పై తమ జట్టు ఏం చేస్తుందని సవాల్ తీసుకున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ సారధి టామ్ లాథమ్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. చిన్న స్టేడియంలో టాస్ గెలిచిన వాళ్లు ఛేజింగ్ ఎంచుకుంటారని నిపుణులు కూడా చెప్పారు.
అయితే తను మాత్రం టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని రోహిత్ స్పష్టం చేశాడు. ఇలాంటి పిచ్, స్టేడియంలో తమ బౌలర్లు ఎలా రాణిస్తారని చూడటమే తన లక్ష్యం అని చెప్పాడు. దీన్ని ఒక సవాల్‌గా తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు తొలి రెండు మ్యాచులు గెలిచిన సంగతి తెలిసిందే. ఇండోర్‌లోని హోల్గర్ స్టేడియం వేదికగా జరిగే మూడో వన్డేలో గెలిస్తే.. సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేయడమే కాదు. వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు కూడా సాధిస్తుంది.
ఈ మ్యాచ్‌లో తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు టామ్ లాథమ్ చెప్పాడు. షిప్లే స్థానంలో డఫ్పీ ఆడుతున్నట్లు వెల్లడించాడు. అయితే భారత జట్టులో మాత్రం రెండు మార్పులు చేసినట్లు రోహిత్ ప్రకటించాడు. ఈ సిరీస్‌లో చక్కగా రాణిస్తూ వచ్చిన మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఇద్దరికీ విశ్రాంతి ఇస్తున్నట్లు చెప్పాడు. వీళ్ల స్థానంలో ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ ఇద్దరికీ అవకాశం ఇచ్చినట్లు చెప్పాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్.