
టాప్ 5లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు
ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. 3వ ర్యాంకులో స్టీవ్ స్మిత్ (845 పాయింట్లు), 4వ ర్యాంకులో పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ (815పాయింట్లు), 5వ ర్యాంకులో కేన్ విలియమ్సన్ (806)పాయింట్లతో టాప్ 5లో ఉన్నారు. ఇక భారత్ స్టార్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (754పాయింట్లు) 8వ స్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ (742పాయింట్లు) 10వ స్థానంలో కొనసాగుతూ టాప్ 10లిస్టులో ఉన్నారు.

దిగజారిన బుమ్రా ర్యాంక్
తాజా టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ ఆరు వికెట్లు పడగొట్టి ఆకట్టుకోవడంతో అతను టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కాస్త మెరుగైన స్థానానికి ఎగబాకాడు. జేమీసన్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో స్థానానినికి పడిపోగా.. పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఐదో స్థానానికి దిగజారాడు. ఇక టాప్ 5లో తొలిస్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (901పాయింట్లు), 2వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (850పాయింట్లు), 3వ స్థానంలో కైల్ జేమీసన్ (836పాయింట్లు), 4వ స్థానంలో జస్ప్రీత బుమ్రా (830పాయింట్లు), 5వ స్థానంలో షాహిన్ ఆఫ్రిది (827పాయింట్లు)తో కొనసాగతున్నారు.

అగ్రస్థానంలోనే జడేజా, రెండో స్థానంలో అశ్విన్
తాజా టెస్ట్ ఆల్రౌంండర్ ర్యాంకింగ్స్‌లో టాప్ 1ప్లేస్‌లో ఇండియన్ స్టార్ రవీంద్రా జడేజా స్థానం పదిలంగా ఉంది. 385పాయింట్లతో రవీంద్ర జడేజా తొలిస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (341పాయింట్లు), మూడో స్థానంలో వెస్టిండీస్ ప్లేయర్ జేసన్ హోల్డర్ (336పాయింట్లు), నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (327పాయింట్లు), అయిదో స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (299పాయింట్లు)తో టాప్ 5లో కొనసాగుతున్నారు.