న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ బ్యాట్స్‌మెన్ తలే లక్ష్యంగా భారత బౌలర్లు హడలెత్తించారు: అక్తర్

Shoaib Akhtar’s big statement on India’s fast bowlers’ attitude

కరాచీ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత బౌలర్లపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు.'భారత్ బలమైన జట్టని న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో గెలిచి మరోసారి నిరూపించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ ముందు స్వల్ప స్కోర్ ఉంచి కివీస్ ఎలా పోరాడాలనుకుంది.'అని తన యూట్యూబ్ చానెల్ వేదికగా అక్తర్ ప్రశ్నించాడు.

 ఔటవ్వాలి..లేకుంటే తగలాలి..

ఔటవ్వాలి..లేకుంటే తగలాలి..

ఇక బుమ్రా, మహ్మద్ షమీ అద్బుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారని కొనియాడాడు. ఔటవ్వాలి లేకుంటే బంతి తగలాలనే మైండ్ సెట్‌తో బౌలింగ్ చేశారన్నాడు. ‘ జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలు షార్ట్ పిచ్ బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ తలే లక్ష్యంగా బౌలింగ్ చేశారు. ఇంతకుముందెప్పుడు వారిలో ఈ కాన్ఫిడెన్స్‌ను చూడలేదు. ఈ మ్యాచ్‌ మొత్తం వారు దూకుడైన మైండ్‌సెట్‌తో బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్‌ వెన్నులో వణుకు పుట్టించారు. ఔటవ్వాలి లేకుంటే తగలాలి అనేవిధంగా బంతులేశారు. న్యూజిలాండ్ భారత బౌలింగ్‌ను కివీస్‌ కూడా తక్కువ అంచనా వేసింది. అందుకు మూల్యం చెల్లించుకుంది. తలకు గురిపెట్టి షాట్‌ పిచ్‌ బంతులు వేయడంతో బంతి ఎడ్జ్‌ తీసుకుంది.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

బుమ్రాను హిట్ చేయడం కష్టం.. ఆ విషయం ఇండియాను చూసి నేర్చుకోవాలి: కివీస్ కీపర్

స్పిన్ టెస్ట్‌..

స్పిన్ టెస్ట్‌..

ఇక రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడని, అతను స్పిన్‌ కివీస్ బ్యాట్స్‌మన్‌కు పరీక్షగా నిలిచిందని అక్తర్ తెలిపాడు.‘రవీంద్ర జడేజా కచ్చితమైన స్పిన్‌తో రాణించాడు. పరుగులను నియంత్రిస్తూ కివీస్‌ బ్యాట్స్‌మన్‌కు పరీక్షగా నిలిచాడు. ప్రస్తుతం భారత్ ఒంటిచేత్తో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. కానీ ఇతర జట్లుకు ఏమైంది? అసలు ప్రపంచ క్రికెట్‌కు ఏమైంది. ఆస్ట్రేలియా ప‍్రపంచ క్రికెట్‌ను శాసించిన సమయంలో భారత్‌, పాకిస్తాన్‌ కనీసం పోరాటం చేసేవి. కానీ ఇప్పుడు న్యూజిలాండ్‌ మాత్రం భారత్‌కు దాసోహమైంది. ప్రపంచలో మేటి జట్టైన భారత్‌ ముందు కనీసం పోరాటం కూడా చేయలేకపోతుంది'

అది ఎల్బీడబ్ల్యూ కాదు.. ఎస్బీడబ్ల్యూ.. ఇప్పటికీ ఇండియన్ ఫ్యాన్స్ తిడుతూనే ఉంటారు !

మూడో టీ20 బుధవారం..

మూడో టీ20 బుధవారం..

రెండో టీ20లో 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా 17.3 ఓవర్లలోనే చేధించి 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఫలితంగా ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరు జట్ల మూడో టీ20 బుధవారం హమిల్టన్ వేదికగా జరగనుంది. ఇక ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోరుతప్పదనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. అక్తర్ చెప్పినట్లు భారత్‌కు, న్యూజిలాండ్ కనీస పోటీవ్వలేకపోతుంది. కనీసం మూడో టీ20లోనైనా గెలిచి సిరీస్ రేసులో నిలుస్తారో? లేక ఓడి భారత్‌కు దాసోహం అంటారో చూడాలి.

Story first published: Monday, January 27, 2020, 19:00 [IST]
Other articles published on Jan 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X