For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రాను హిట్ చేయడం కష్టం.. ఆ విషయం ఇండియాను చూసి నేర్చుకోవాలి: కివీస్ కీపర్

New Zealands Tim Seifert Says Tough to hit Jasprit Bumrah, need to learn from India how to adapt to conditions

ఆక్లాండ్ : భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్‌ అభిప్రాయపడ్డాడు. ఇక పరిస్థితులను అందిపుచ్చుకోవడం ఎలాగో ఇండియాను చూసి నేర్చుకోవాలని తన సహచరులకు సూచించాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించి ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా(1/21) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

బుమ్రా బౌలింగ్ కష్టం..

బుమ్రా బౌలింగ్ కష్టం..

ఈ నేపథ్యంలోనే సీఫెర్ట్ బుమ్రా బౌలింగ్‌ ఆడటం కష్టంగా ఉందన్నాడు. ‘తొలి మ్యాచ్‌లో కూడా బుమ్రా స్లో బంతులను ఎక్కువగా వేశాడు. మాములుగా డెత్ బౌలర్లు స్ట్రెయిటర్ లైన్స్, యార్కర్స్, చాతి ఎత్తులో వచ్చే బంతులను విసురుతారు. కానీ బుమ్రా మాత్రం వీటన్నిటిని మార్చి మార్చి వేస్తుంటాడు. అందుకే అతని బౌలింగ్ ఎదుర్కోవడం కష్టం. బౌలర్లు బంతి పట్టుచిక్కినప్పుడు.. క్రీజును వీడి ముందుకొచ్చి స్ట్రైట్ బౌలింగ్ చేస్తున్నారో చూసి ఆడాలి. అలా ఆడా కాబట్టే నేను నిలబడ్డా'అని 26 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సీఫెర్ట్ చెప్పుకొచ్చాడు.

అలానే విలియమ్సన్ ఔటయ్యాడు..

అలానే విలియమ్సన్ ఔటయ్యాడు..

తర్వాత బుమ్రా వస్తాడనే విలియమ్సన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసి జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడని ఈ వికెట్ కీపర్ తెలిపాడు. ఇక న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పరిస్థితులను అడాప్ట్ చేసుకోవడం ఎలాగో ఇండియన్ ప్లేయర్లను చూసి నేర్చుకోవాలన్నాడు. ఇక తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, కానీ ఇండియన్ బ్యాట్స్‌మన్ బాగ ఆడారన్నాడు.‘నిజాయితీగా చెప్పాలంటే తొలి మ్యాచ్‌లో ఓ దశలో ఇండియా 110-1. మేం చెత్తగా ఏం బౌలింగ్ చేయలేదు. కానీ వికెట్లు చేతిలో ఉండటంతో చెలరేగారు. రెండో మ్యాచ్‌లో మేం 130 పరుగులే చేశాం. ఈడెన్ పార్క్‌లో ఆ స్కోర్‌ను కాపాడుకోవడం చాలా కష్టం. మేం 170 పరుగులు చేయాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. కానీ మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.'అని సీఫెర్ట్ తెలిపాడు.

ఆ ఓటమి నుంచి బయట పడలేదు..

ఆ ఓటమి నుంచి బయట పడలేదు..

ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓటమి కూడా ఇండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించకపోవడానికి ఒక కారణమన్నాడు.‘చాలా మంది టెస్ట్ సిరీస్ నుంచి నేరుగా టీ20లు ఆడారు. నాలాంటి వారు కొంతమంది మాత్రం గత రెండు నెలలు సూపర్ స్మాష్ టోర్నీ ఆడారు. గత రెండు మ్యాచ్‌లతో వారికి గేమ్ అర్థమైందనుకుంటున్నా. చిన్న లక్ష్యాలను కాపాడుకోవాలంటే.. ప్రత్యర్థి టాప్ -6 బ్యాట్స్‌మన్ 10 ఓవర్లలోపే ఔటవ్వాలి. ఏ ఒక్క బ్యాట్స్‌మన్ ఫీఫ్టీ చేసినా ఇతరులు బాగా ఆడుతారు. కాబట్టి టాప్-6 బ్యాట్స్‌మెన్‌ను త్వరగా ఔట్ చేయాలనుకున్నాం. 'అని సీఫెర్ట్ చెప్పుకొచ్చాడు.

మేం చెత్తగా ఆడలేదు.

మేం చెత్తగా ఆడలేదు.

‘గత రెండు మ్యాచ్‌లు ఓడినా.. మేం మాత్రం చెత్తగా ఆడలేదు. మేం బాగా ఆడినప్పటికీ మాకంటే ఇండియా ఇంకా బాగా ఆడింది. ఒక వేళ బుధవారం మేం సిరీస్ కోల్పోయినా ప్రపంచం ఏం అంతమవ్వదు. కానీ మా సాయశక్తుల పోరాడుతాం. గతంలో మేం 2-1తో సిరీస్‌ను గెలిచాం. ఇప్పుడు కూడా మిగతా మ్యాచ్‌లను అలానే భావించి గెలుస్తాం. అలాగే జరగబోయే తొలి రెండు మ్యాచ్‌లను చావో రేవోగా భావించి ఆడుతాం. ఇక టీ20 ప్రపంచకప్‌కు ముందు బాగా చాలా సమయం ఉంది. 20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అప్పటి వరకు మా సన్నహకాలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం'అని తెలిపాడు. ఇక మూడో టీ20 హామిల్టన్ వేదికగా బుధవారం జరగనుంది.

Story first published: Monday, January 27, 2020, 18:36 [IST]
Other articles published on Jan 27, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+