న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్, హర్భజన్ సింగ్ కటీఫ్ కామెంట్స్‌పై స్పందించిన అఫ్రిది

Shahid Afridi responds on Yuvraj, Harbhajan Singhs reaction against him over controversial remarks

కరాచీ: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాహిద్ అఫ్రిదిపై భారత క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న అఫ్రిది ఆ మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించాడు.

అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాకిస్థాన్ సైన్య బలగం ఎంత ఉందో.. అంతమంది భారత సైనికులను మోదీ కశ్మీర్‌లో మోహరించారని, అతని మనసులో కరోనాను మించిన వ్యాధి ఉందని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో అఫ్రిదిపై భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

అఫ్రిది ఫౌండేషన్‌కు సాయం చేయాలని భారత అభిమానులను కోరి చివాట్లు తిన్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు సైతం అఫ్రిది కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. మానవతాదృక్పథంతో చేస్తున్న సేవకు సాయం చేయాలని కోరగానే స్పందించామని, కానీ అతని మనసులో ఇంతటి విద్వేశం ఉందని తెలియదన్నారు. ఇక నుంచి అతనితో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, తమ స్నేహం కటీఫ్ అని పేర్కొన్నారు.

అఫ్రిది.. అంగీకరంచను..

అఫ్రిది.. అంగీకరంచను..

‘గౌవరనీయులైన మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధించాయి. బాధ్యాతాయుతమైన భారతీయుడిగా.. దేశం తరఫున ఆడిన ఆటగాడిగా అఫ్రిది.. ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం అంగీకరించను. మానవత్వం కోసం నీవు అడగ్గానే నా వంతు సాయం చేశా. కానీ మరోసారి చేయను'అని యూవీ ట్వీట్ చేశాడు.

ఆ రోజు ధోనీకి బిర్యానీ వడ్డించి ఉంటే.. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేవాడిని: మహ్మద్ కైఫ్

అఫ్రిదితో కటీఫ్..

అఫ్రిదితో కటీఫ్..

అఫ్రిది చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావని హర్భజన్ ఇండియా టూడేతో మాట్లాడుతూ అన్నాడు. ‘మా దేశం గురించి, ప్రధాని గురించి అఫ్రిది చేసిన వ్యాఖ్యలు బాధించాయి. అతని కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావు. అతను మా సహాయం కోరినప్పుడు మేము ఏదీ ఆలోచించకుండా ముందుకు వచ్చాము. మానవత్వంతో స్పందించాం. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలని అలా చేశాం.

మా ప్రధాని కూడా కరోనా వైరస్‌కి దేశం, కులం, మతం ఏదీ లేదని చెప్పారు. కాబట్టి మేము సంక్షోభాన్ని అధిగమించేందుకే అఫ్రిదికి సాయంగా నిలిచాం. ఈ సంక్షోభంలో మా వంతు సహాయాన్ని మేము అందించాం. కానీ ఈ మనిషి(అఫ్రిది) మా దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే చెబుతున్నా.. అతనితో మాకెలాంటి సంబంధం లేదు. మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు అతనికి ఏ మాత్రం లేదు. అతను తన హద్దుల్లో తన దేశంలో ఉంటే బాగుంటుంది' అని భజ్జీ ఫైర్ అయ్యాడు.

ఆ ఒత్తిడితోనే నన్ను తిట్టారు..

ఆ ఒత్తిడితోనే నన్ను తిట్టారు..

తాజాగా భజ్జీ, యూవీ వ్యాఖ్యలపై అఫ్రిది స్పందించాడు. కశ్మీర్, మోదీపై తాను చేసి వ్యాఖ్యలు వైరల్ కావడంతోనే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అఫ్రిది పేర్కొన్నాడు. భారత్‌లో ప్రజలు అణచివేతకు గురువుతున్నారని వారికి కూడా తెలుసని పాకిస్థాన్ హమ్ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ‘నా ఫౌండేషన్‌కు అండగా నిలుస్తూ సాయం చేసిన హర్భజన్, యువరాజ్‌ పట్ల నేనెప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను. అసలు సమస్య ఏంటంటే వారిపై నెలకొన్న ఒత్తిడే. వారు ఆ దేశం నివసిస్తున్నారు. కాబట్టి నిస్సహాయులగా ఉండిపోయారు. వారికి కూడా తెలుసు ఆ దేశంలో ప్రజలను ఎలా అణచివేస్తున్నారో. ఇంతకంటే నేనేం చెప్పలేను'అని అఫ్రిది పేర్కొన్నాడు.

సాయం అందుకొని భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలా? అఫ్రిదిపై కనేరియా ఫైర్

Story first published: Tuesday, May 26, 2020, 18:50 [IST]
Other articles published on May 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X