న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాయం అందుకొని భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలా? అఫ్రిదిపై కనేరియా ఫైర్

Danish Kaneria slams Shahid Afridis PoK speech and questions his friendship with Harbhajan, Yuvraj Singh

కరాచీ: భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు. భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌ల స్నేహానికి ఇచ్చే విలువ ఇదేనా? అని అఫ్రిదిని ప్రశ్నించాడు. వారి ద్వారా ఆ దేశ సాయాన్ని కోరి అది అందిన తర్వాత ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నాడు.

ఇక కరోనా వైరస్ కారణంగా రోడ్డున పడ్డ అభాగ్యులకు అఫ్రిది అండగా నిలిచిన విషయం తెలిసిందే. తన ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతున్న ఈ పాక్ మాజీ కెప్టెన్‌కు యువరాజ్, భజ్జీ మద్దతుగా నిలిచారు. మానవతాదృక్పథంతో కరోనాపై పోరాడుతున్న అఫ్రిదికి సాయం చేయాలని, చేతనైన విరాళలు అందించాలని ఈ ఇద్దరూ భారత అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

వారి సూచన మేరకు కొందరు అఫ్రిది పౌండేషన్‌కు విరాళాలు కూడా అందజేశారు. అయితే ఇంకొందరూ మాత్రం తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. శతృదేశానికి సాయం చేయమంటారేంది? మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ట్రోలింగ్‌కు ఏమాత్రం భయపడని ఈ సింగ్ క్రికెటర్స్.. సరిహద్దులతో సంబంధం లేకుండా మానవతాదృక్పథంతో అఫ్రిదికి సాయం చేయాలని పిలుపునిస్తూ విమర్శలను తిప్పికొట్టారు.

విద్వేషపూరిత వ్యాఖ్యలు..

విద్వేషపూరిత వ్యాఖ్యలు..

అయితే పాకిస్థాన్ మొత్తం తన ఫౌండేషన్ సేవలను విస్తరించిన అఫ్రిది... పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా పర్యటించాడు. ఈ సందర్భంగా భారత్‌పై తనకున్న విధ్వేశాన్ని చాటుకున్నాడు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

‘పాకిస్థాన్‌‌ సైనిక బలం మొత్తం 7 లక్షలు ఉంటే.. దానికి మించిన సంఖ్యలో భారత బలగాలను మోదీ కేవలం కశ్మీర్‌లోనే మోహరించారు. ప్రపంచం కరోనా అనే మహమ్మారితో పోరాడుతుంది. కానీ నరేంద్ర మోదీ మనస్సులో దానికి మించిన వ్యాధి ఉంది'అని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా వచ్చే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)‌లో కశ్మీర్ పేరిట ఓ జట్టును తీసుకోవాలని పీసీబీకి సూచించాడు. ఆ జట్టుకు తానే కెప్టెన్‌గా ఉంటానని తెలిపాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌ ‌‌చల్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది.

తిప్పికొట్టిన భారత క్రికెటర్లు..

తిప్పికొట్టిన భారత క్రికెటర్లు..

భారత క్రికెటర్లంతా అఫ్రిదిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అఫ్రిదితో తమకు ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని శిఖర్ ధావన్, రైనా స్పష్టం చేశారు. గత 70 ఏళ్లుగా పాక్ బిచ్చమెత్తుకుంటుందని, అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ ఆ దేశ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని గౌతం గంభీర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

డ్రగ్స్ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్!

రాజకీయాల్లో వెళ్లాలనుకుంటే..

రాజకీయాల్లో వెళ్లాలనుకుంటే..

ఇక తాజాగా అఫ్రిది వ్యాఖ్యలపై అతని సహచర ఆటగాడు కనేరియా స్పందించాడు. అఫ్రిది రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే క్రికెట్‌తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని సూచించాడు. అతని వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా పాక్‌ క్రికెట్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని మండిపడ్డాడు.

‘ఏదైనా మాట్లాడే ముందు అఫ్రిది ఒకసారి ఆలోచించుకోవాలి. అతనికి రాజకీయాల్లోకి వెళ్లాలనుంటే క్రికెట్‌తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలి. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు.. భారత్‌లోనే కాకుండా యావత్ ప్రపంచానికి పాకిస్థాన్ క్రికెట్‌పై వ్యతిరేకత కలిగేలా చేస్తాయి.'అని కనేరియా ఇండియా టీవీతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

వారి స్నేహానికి నువ్విచ్చే విలువ ఇదేనా?

వారి స్నేహానికి నువ్విచ్చే విలువ ఇదేనా?

ఇక యూవీ, భజ్జీల సాయాన్ని ఆర్జించి వారి దేశం, ప్రధానిపైనే అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని కనేరియా ప్రశ్నించాడు. ‘అతను వారి సాయం కోరాడు. అందుకున్నాడు. ఇప్పుడేమో.. ఆ దేశం, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు ఇదే రకమైన స్నేహం? వారి ఫ్రెండ్షిప్‌కు ఇచ్చిన విలువ ఇదేనా?'అని కనేరియా ప్రశ్నించాడు. ఇక హిందువుగా పాకిస్థాన్ జట్టులో వివక్షను ఎదుర్కొన్నానని తెలిపిన కనేరియా...గత రెండు నెలలుగా ఏదో రకంగా కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

ఆ రోజు ధోనీకి బిర్యానీ వడ్డించి ఉంటే.. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేవాడిని: మహ్మద్ కైఫ్

Story first published: Tuesday, May 26, 2020, 14:13 [IST]
Other articles published on May 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X