
ఇంటికి పిలిచి ఇబ్బంది పడ్డా..
ప్రస్తుతం లాక్‌డౌన్‌లో వరుస ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్న ఈ ఉత్తరప్రదేశ్ క్రికెటర్.. టీమిండియాకు తన ఇంట్లో ఇచ్చిన విందు గురించి తాజాగా స్పోర్ట్ స్క్రీన్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు. తొలిసారి తన సహచర ఆటగాళ్లను ఇంటికి పిలిచానని.. వారికి ఏర్పాట్లు చేసే విషయంలో కొంత ఇబ్బందికి గురైనట్లు జ్ఞాపకం చేసుకున్నాడు. ముఖ్యంగా జూనియర్ ఆటగాళ్లను సరిగ్గా పట్టించుకోలేదన్నాడు.
‘2006లో నోయిడాలోని మా ఇంటికి భారత క్రికెటర్లందరిని ఆహ్వానించా. నాటి కోచ్ గ్రేగ్ చాపెల్, సౌరవ్ గంగూలీతో పాటు జట్టు సభ్యులందరూ వచ్చారు. అంత పెద్ద సెలెబ్రిటీలను చూసుకోవడం కొంత నర్వస్‌గా ఫీలయ్యా. అప్పుడు సచిన్, గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లతోనే నేను ఎక్కువగా గడిపా.'అని చెప్పుకొచ్చాడు.
శాండ్‌విచ్ తింటుంటే బ్యాటింగ్‌కు వెళ్లమన్నాడు: సురేశ్ రైనా

ఇప్పటికీ ధోనీ ఆటపట్టిస్తాడు
అయితే జూనియర్, సీనియర్ ఆటగాళ్లు వేర్వేరు గదుల్లోకూర్చున్నారని, తాను మాత్రం సీనియర్ ఆటగాళ్లతో ఉంటూ..అప్పటి జూనియర్ ఆటగాళ్లైన ధోనీ, సురేశ్ రైనాలను సరిగ్గా పట్టించుకోలేదన్నాడు. ఈ విషయం ఇప్పటికి ఇంకా గుర్తుందన్నాడు. ధోనీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంటికి వస్తే సరిగ్గా చూసుకోలేదని తనను ఆటపట్టిస్తాడని తెలిపాడు. ఆరోజే ధోనీకి సరిగ్గా బిర్యానీ వడ్డించి ఉంటే అతను 2007లో కెప్టెన్ అయిన తర్వాత జట్టులోకి వచ్చే అవకాశం ఉండేదని నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించాడు.

రీ ఎంట్రీ ఇవ్వకపోవడానికి ఇదో కారణం..
‘జూనియర్స్ ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా మిగతా జూనియర్ ఆటగాళ్లు ఓ గదిలో కూర్చోగా.. సచిన్, గంగూలీ వంటి సీనియర్స్ మరో రూమ్‌లో కూర్చున్నారు. నేను ఎక్కువగా సీనియర్స్‌తోనే ఉండిపోయాను. జూనియర్స్‌ను సరిగ్గా పట్టించుకోలేదు కూడా. నేను సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేదని ధోనీ కూడా అనుకొని ఉండొచ్చు. 2007లో ధోనీ కెప్టెన్ అయిన తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. అతనెప్పుడూ ఇంటికి వస్తే సరిగ్గా చూసుకోలేదని గుర్తు చేస్తూ ఆటపట్టిస్తుంటాడు.'అని కైఫ్ నవ్వుతూ సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇప్పటికీ ధోనీనే నెంబర్ వన్
ఇక అంతకు ముందు ఓ లైవ్ సెషన్‌లో ధోనీపై కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను ధోనీకి విరాభిమానినని తెలిపాడు. ఫిట్‌నెస్ విషయంలో ధోనీకి తిరుగులేదని, ఇప్పటికీ అతనే నంబర్ వన్ వికెట్ కీపరని కైఫ్ కొనియాడాడు. ఉన్న పళంగా ధోనీని టీమ్ నుంచి తప్పించాల్సిన పనిలేదన్న ఈ మాజీ క్రికెటర్.. కేఎల్ రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్‌గానే పరిగణించాలని సూచించాడు. ‘ధోనీ కొంచె గ్యాప్ తీసుకోవడంతో ఐపీఎల్ ఆడితే రీ ఎంట్రీ సులువవుతుందని అంతా అనుకున్నారు. కానీ నా దృష్టిలో అది సరైనా ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ చాలా పెద్ద ప్లేయర్. తిరుగులేని మ్యాచ్ విన్నర్. ఆరు, ఏడు స్థానాల్లో ఒత్తిడిలో ఎలా ఆడాలో ధోనీ కంటే ఎవరికి బాగా తెలియదు. ధోనీని ఎవరూ భర్తీ చేయలేరు'అని తెలిపాడు.
ఐపీఎల్‌లో రాణించినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేనా?.. సెలెక్టర్ల తీరుపై హర్భజన్ ఫైర్


Click it and Unblock the Notifications












