న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రాంచీలో ఉంటాడు.. వెళ్లి అడగండి: రోహిత్ సెటైర్స్

Rohit Sharma Says to fans Go ask MS Dhoni directly, have no idea about his India future
Rohit Sharma - 'Go Ask MS Dhoni Directly, Have No Idea About His Future'

ముంబై: మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం గురించి తనకేం తెలియదని, తెలుసుకోవాలని అనుకుంటున్న వారు రాంచీలో ఉన్న అతన్నే అడగాలని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సూచించాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన హిట్ మ్యాన్.. పలువురు ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌లో పాల్గొని క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే కెవిన్ పీటర్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్‌‌తో లైవ్ సెషన్స్‌లో పాల్గొన్న ఈ ముంబై క్రికెటర్.. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చాడు.

మహీ ఎవరికీ దొరకడు..

మహీ ఎవరికీ దొరకడు..

ఈ నేపథ్యంలోనే కొందరూ ధోనీ భవితవ్యంపై ప్రశ్నించగా రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ధోనీ నిజంగా క్రికెట్ ఆడకూడదు అనుకుంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. ‘ధోనీ క్రికెట్ ఆడటం ఆపేస్తే ఎవరికీ దొరకడు. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. ధోనీ రాంచీలో ఉంటాడని అందరికీ తెలుసు. అతను మళ్లీ ఆడతాడా లేదా అనే డౌట్ ఉన్నవాళ్లందరూ అక్కడికి వెళ్లి నేరుగా అతన్నే అడగండి. కానీ లాక్‌డౌన్ ముగిశాకే వెళ్లండి. కారు, బైక్, ఫ్లయిట్ ఏదో ఒకదాని సాయంతో రాంచీకి వెళ్లి నువ్వు ఏం చేస్తావని మహీని అడగండి. మాకైతే తన గురించి ఏం తెలియదు. వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా ధోనీ భవితవ్యంపై ఎలాంటి సమాచారం లేదు'అని రోహిత్ చెప్పాడు.

మేం దేశం కోసం ఆడితే.. భారత క్రికెటర్లు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడారు: పాక్ మాజీ క్రికెటర్

 ఆటకు దూరం.. తెరపైకి రిటైర్మెంట్..

ఆటకు దూరం.. తెరపైకి రిటైర్మెంట్..

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత ఆర్మీలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నా.. ఆ తర్వాత కూడా ఎలాంటి క్రికెట్ ఆడలేదు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దీంతో ధోనీ క్రికెట్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఐపీఎల్‌‌లో సత్తాచాటితే ధోనీ రీ ఎంట్రీ ఉంటుందని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ కరోనా దెబ్బకు లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఇక చెన్నై ప్లేయర్లు మాత్రం ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు నిర్వహించిన చెన్నై ప్రాక్టీస్ క్యాంప్‌లో ధోనీ ఎన్నడు లేని విధంగా సాధన చేశాడని, రీ ఎంట్రీ ఇవ్వాలనే కసి అతనిలో కనబడిందని తెలిపారు.

 ఇక భారత్ తరఫున ధోనీ ఆడడు..

ఇక భారత్ తరఫున ధోనీ ఆడడు..

ఇక చెన్నై ఆటగాడేనైన హర్భజన్ సింగ్ మాత్రం ధోనీ.. మళ్లీ భారత్ తరఫున బరిలోకి దిగుతాడని, బ్లూ జెర్సీ ధరిస్తాడని తాను అనుకోవడం లేదన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో ఉన్నప్పుడు చాలా మంది తనను ధోనీ భవితవ్యం గురించి అడిగారని, కానీ తనకు తెలియదని, అది ధోనీ వ్యక్తిగత నిర్ణయమని చెప్పినట్లు భజ్జీ తెలిపాడు. ‘ఐపీఎల్ మాత్రం ధోనీ 100 శాతం ఆడాలనుకుంటున్నాడు. కానీ భారత్‌కు ఆడే విషయం‌లో అతని ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు. కానీ నా అంచనా ప్రకారం అతను భారత్ తరఫున మళ్లీ బరిలోకి దిగే అవకాశం లేదు. అతను కూడా ఆడాలనుకోవడం లేదనుకుంటున్నా. ఇప్పటికే భారత్ తరఫున ధోని చాలా ఆడాడు. నాకు తెలిసినంతవరకు మహీ మళ్లీ బ్లూ జెర్సీ ధరించడానికి సుముఖంగా లేడు. ప్రపంచకప్‌లో ఆడిన మ్యాచే తన కెరీర్‌లో ఆఖరిదనుకుంటున్నాడు. ఈ విషయంలో మరికొంతమంది కూడా నా వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.'అని భజ్జీ తెలిపాడు.

నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్

Story first published: Friday, April 24, 2020, 10:30 [IST]
Other articles published on Apr 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X