
రెండు జట్లకు ఇదే తేడా..
1992లో పాకిస్థాన్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్‌లో పాక్ ఆటగాళ్లు తమ దేశం కోసం క్రికెట్ ఆడితే.. భారతీయులు మాత్రం వాళ్ల స్వార్థం కోసం క్రికెట్ ఆడారని ఆయన పేర్కొన్నారు.
పాక్ ప్లేయర్లు 30, 40 పరుగులు చేసినా జట్టు విజయం కోసం కృషి చేసారని, కానీ భారత ఆటగాళ్లు సెంచరీ చేసినా.. వారి సొంత రికార్డుల కోసం ఆడారన్నాడు. ‘భారత్‌తో ఆడుతున్నప్పుడు లెక్కల పరంగా వారి బ్యాటింగ్ మాకంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉండేది. కానీ మా బ్యాట్స్‌మెన్ 30,40 పరుగులు చేసినా.. అవి జట్టు విజయానికి ఉపయోగపడేవి. కానీ భారత ప్లేయర్లు సెంచరీలు చేసినా.. అవి వారి వ్యక్తిగత రికార్డుల కోసమే అన్నట్లు ఉండేది. రెండు జట్లకు ఉన్న తేడా అదే' అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.
అతనికి బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేది: షాహిద్ అఫ్రిది

అందుకే ఇమ్రాన్ గొప్ప కెప్టెన్ అయ్యాడు..
యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడంతోనే ఇమ్రాన్ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడని ఈ పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు.
‘ఇమ్రాన్ బాయ్.. టెక్నికల్ కెప్టెన్ కాదు. కానీ ఆటగాళ్ల నుంచి తనకు కావాల్సింది ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. ఆటగాళ్ల ఫామ్‌ని చూడకుండా అతను జట్టులో అవకాశం ఇచ్చేవాడు. అదే అతన్ని పాకిస్థాన్‌కు గొప్ప కెప్టెన్‌గా చేసింది. ఇదే అతనిపై ప్రతీ ఒక్కరికి గౌరవం పెరిగేలా చేసింది.‘ అని ఇంజమామ్ అభిప్రాయపడ్డాడు.

పాక్‌దే పైచేయి..
వన్డే, టెస్ట్ క్రికెట్ ముఖాముఖిలో ఇప్పటికీ భారత్ కంటే పాక్ మెరుగైన రికార్డు కలిగి ఉంది. కానీ ప్రపంచకప్ విషయానికొస్తే టీమిండియాదే పైచేయి. అది వన్డే అయినా.. టీ20 ప్రపంచకప్ అయినా.. భారత్‌ను పాక్ ఇప్పటివరకు ఓడించలేదు.
ఇరు జట్లు ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 199 సార్లు తలపడగా.. పాక్ 86 మ్యాచ్‌ల్లో గెలవగా.. భారత్ 70 మ్యాచ్‌ల్లోనే విజయాన్నందుకుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 59 టెస్ట్‌లు జరగ్గా.. పాక్ 12 టెస్టుల్లో గెలవగా భారత్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక 38 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
139 వన్డేల్లో భారత్ 55 గెలవగా.. పాక్ 73 మ్యాచ్‌లు గెలిచింది. 8 టీ20ల్లో మాత్రం భారత్ 6 విజయాలు సాధించగా.. పాక్ ఒక్కటంటే ఒకటే గెలిచింది. ఒకటి టై అయింది. టీ20, వన్డే ప్రపంచకప్‌లలో మొత్తం 13 సార్లు తలపడగా 12 సార్లు భారత్ గెలిచి.. ఒక టీ20 మ్యాచ్ టై అయింది.


Click it and Unblock the Notifications
