Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్

Mohammed Siraj picks Prabhas as his favourite South Indian actor

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన ఫేవరేట్ సౌతిండియన్ యాక్టర్ అని టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ హైదరాబాద్ స్టార్ పేసర్.. క్రిక్ ట్రాకర్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ సెషన్‌లో పాల్గొన్నాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. అయితే ఫేవరేట్ సౌతిండియాన్ హీరో, మూవీ ఏంటిదని ఓ అభిమాని ప్రశ్నించగా.. సిరాజ్ ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్, 'బాహుబలి' సినిమా అని తెలిపాడు.

ఫేవరేట్ మూవీ బాహుబలి..

ఫేవరేట్ మూవీ బాహుబలి..

తనకు బాహుబలి బిగినింగ్ చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ఫాలోయింగ్ లభించింది.

పీక కోస్తానని హెచ్చరించడంతోనే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టా:

ఆ క్షణం మరవలేనిది..

ఆ క్షణం మరవలేనిది..

ఇక క్రికెట్ కెరీర్‌కు సంబంధించి కూడా సిరాజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం తన జీవితంలో మరిచిపోలేని అద్భుత క్షణమని పేర్కొన్నాడు. 2017 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో ఈ హైదరాబాద్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్‌కు ముందు కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకుంటుండగా సిరాజ్ ఉబికి వచ్చిన దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే అలా ఎమోషన్ కావడానికి గల కారణాన్ని ఈ స్టార్ పేసర్ తాజాగా వెల్లడించాడు. ఆ క్యాప్ అందుకుంటున్న క్షణం.. తన కష్టాలన్నీ గుర్తుకొచ్చాయని, దాంతో తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయానని తెలిపాడు.

వారికి బౌలింగ్ చేయడం కష్టం..

వారికి బౌలింగ్ చేయడం కష్టం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్‌లకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని సిరాజ్ చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడుతున్న సిరాజ్.. తన తొలి సీజన్ 2017లో మాత్రం హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక గత సీజన్‌లో చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. సిరాజ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.

 ఖలీల్ చాలా లేజీ..

ఖలీల్ చాలా లేజీ..

భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్ చాలా లేజీ అని చెప్పుకొచ్చిన సిరాజ్.. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చాలా క్లోజ్ అని తెలిపాడు. ఇక చహల్ ఆర్‌సీబీ ఆటగాడనే విషయం తెలిసిందే. ఇక ఆర్‌సీబీ టీమ్‌లో కొలిన్ డి గ్రాండ్ హోమ్ చాలా సరదా వ్యక్తని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఐపీఎల్‌లో హైదరాబాద్ తరఫున కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సిరాజ్.. ఆర్సీబీ తరఫున గత రెండేళ్లలో 20 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో 11 వికెట్లు.. 2019లో 7 వికెట్లు పడగొట్టాడు.

ఈ సీజన్ రంజీలో కూడా సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 5 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అనామక క్రికెటర్ అయిన సిరాజ్ ఐపీఎల్‌తోనే వెలుగులోకి వచ్చాడు. 2018 వేలంలో ఆర్సీబీ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో సిరాజ్ జీవితమే మారిపోయింది.

Story first published: Wednesday, April 22, 2020, 12:19 [IST]
Other articles published on Apr 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+