న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో సిరీస్ అప్పట్లా కాదు.. ఈ సారి లెక్క వేరు: రోహిత్

Rohit Sharma Says Australia Series This Time Will Be Different Ball Game With Steve Smith And David Warner Around

న్యూఢిల్లీ: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల రాకతో ఆస్ట్రేలియా జట్టు బలం పెరిగిందని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ ఇద్దరి రాకతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ కాస్త భిన్నంగానే జరుగుతుందని, మునుపటిలా ఉండదని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు. ఇ-కాంక్లేవ్ 2020 సందర్భంగా బుధవారం ఇండియా టుడేతో రోహిత్ మాట్లాడాడు. ఈ సందర్బంగా పలు ఆసక్తిక విషయాలు వెల్లడించాడు.

 నిషేధంతో స్మిత్, వార్న్ దూరం..

నిషేధంతో స్మిత్, వార్న్ దూరం..

బాల్‌టాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురైన ఈ ఆసీస్ స్టార్ క్రికెటర్లు 2018-19లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్ ఆడలేకపోయారు. దీంతో భారత్‌ 2-1తో టెస్టు సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చి ఈ సిరీస్‌ను ఆడనిస్తే తప్పకుండా భారత్, ఆసీస్‌ మధ్య పోరు రసవత్తరంగా జరుగుతుందని రోహిత్‌ శర్మ అన్నాడు.

ఈ సిరీస్ కోసం వెయిటింగ్..

ఈ సిరీస్ కోసం వెయిటింగ్..

‘న్యూజిలాండ్ సిరీస్ కోసం చాలా ఎదురు చూశా. అనుకోకుండా కాలిపిక్కలో గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకున్నా. అందుకే ఎప్పుడెప్పుడు ఆస్ట్రేలియా వెళ్దామా, అక్కడ టెస్ట్‌లు ఆడదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా. స్మిత్, వార్నర్ జట్టులో ఉండి, ఆసీస్ గడ్డపై మ్యాచ్ అంటే చాలా కొత్తగా ఉంటుంది. కఠినమైన పోటీ ఎదురవుతుంది. అయినా ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా ఉంది. కరోనా గండం దాటి సిరీస్ జరిగితే నిజంగా ఓ గొప్ప టోర్నీ అవుతుంది'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.ఈ కంగారూ పర్యటన జనవరి దాకా సాగుతుంది. అయితే మధ్యలో టి20 ప్రపంచకప్‌ కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కరోనా వైరస్‌పైనే ఆధారపడ్డాయి.

నిక్కర్ మీదున్న నన్ను బ్యాటింగ్‌కు వెళ్లమంటే షాకయ్యా: కార్తీక్

 చాలా విచిత్రంగా ఉంటుంది..

చాలా విచిత్రంగా ఉంటుంది..

కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ఖాళీ స్టేడియాల్లో ఈ క్యాష్ రిచ్‌ లీగ్ టోర్నీ నిర్వహించాలనే ప్రతిపాదన ఊపందుకుంది. దీనిపై హిట్ మ్యాన్ స్పందిస్తూ.. 'ఖాళీ స్టేడియంలో క్రికెట్ ఆడటం విచిత్రంగా ఉంటుంది. అభిమానులు అందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నా. నా చిన్నతనంలో ఎవరూ లేని చోట క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఐపీఎల్ టోర్నీపై బోర్డు ఏ నిబంధనలతో ముందుకొస్తుందో.. వాటిని పాటించక తప్పుదు. ఇలా చేస్తే.. కనీసం అభిమానులు మమ్మల్ని టీవీలో అయినా చూస్తారు. వారికి అది కాస్త ఊరటనిస్తుంది' అని రోహిత్ అన్నాడు.

రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

ఆటగాళ్లకు ప్రమాదం జరగకుండా ఉండటానికి లీగ్‌ను ఒకే నగరంలో లేదా రెండు నగరాల్లో నిర్వహించాలని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఐపీఎల్‌కు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు మనమందరం ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల కోసం వేచి ఉండాలని రోహిత్ పేర్కొన్నాడు.'మ్యాచ్‌ల షెడ్యూల్ ఒకసారి నిర్ణయించిన తర్వాత మ్యాచ్‌లు నిర్వహించే చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నగరం అయినా రద్దీ లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే.. వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. ఆటగాళ్లు నివసించే హోటల్ పరిసరాల్లో తగిన భద్రత ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఖాళీ సమయంలో ఎవరూ బయటకు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి' అని భారత ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

రికార్డులు ధోనీ పేరిటనే ఉన్నా.. బెస్ట్ కెప్టెన్ మాత్రం అతనే: గంభీర్

Story first published: Thursday, April 23, 2020, 9:11 [IST]
Other articles published on Apr 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X