న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిక్కర్ మీదున్న నన్ను బ్యాటింగ్‌కు వెళ్లమంటే షాకయ్యా: కార్తీక్

Karthik Revealed He Was Surprised When Asked To Bat Ahead of MS Dhoni in World Cup 2019 Semi-final

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత్.. సెమీస్‌లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓడి ఇంటిదారి పట్టింది. ఈ మెగాటోర్నీలో అప్పటి వరకు ఆధిపత్యం కనబర్చిన భారత టాపార్డర్ కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో.. ఆఖరి వరకు ధోనీ పోరాడినా ఫలితం దక్కలేదు.

షాక్‌కు గురయ్యా..

షాక్‌కు గురయ్యా..

అయితే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తు టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చే ధోనీని పక్కన పెట్టి.. సీనియర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను ఐదో స్థానంలో పంపించారు.

ఈ నిర్ణయం తనను కూడా షాక్ గురిచేసిందని తాజాగా క్రిక్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. నిక్కర్ మీద ఉన్న తనను ధోనీని కాదని బ్యాటింగ్‌కు వెళ్లమనగానే ఆశ్చర్యపోయానని ఈ సీనియర్ వికెట్ కీపర్ తెలిపాడు.

అద్భుత క్యాచ్‌కు..

అద్భుత క్యాచ్‌కు..

240 పరుగుల స్వల్ఫ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఐదు పరుగులకే మూడు కీలక వికట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో వికెట్లు పడకుండా ఆపడానికి టీమ్‌మేనేజ్‌‌మెంట్ కార్తీక్‌ను పంపించింది. అయితే అతను 29 బంతుల్లో 6 పరుగులతో అదే ప్రయత్నం చేసినా.. దురదృష్టవశాత్తు జీమ్మీ నీషమ్ అద్భుత క్యాచ్‌కు 10వ ఓవర్లోనే వెనుదిరిగాల్సి వచ్చింది. ఆఖరికి భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

అసలు ఊహించలే..

అసలు ఊహించలే..

‘ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమనగానే కొంత ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని ముందే చెప్పారు. కానీ టోర్నీలో అత్యంత బలంగా ఉన్న మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. నిక్కర్ వేసుకొని డగౌట్‌లో కూర్చున్న నాకు బ్యాటింగ్‌కు రెడీ కావాలని చెప్పారు.

నేను డ్రెస్సింగ్ రూం లోపలికి వెళ్లి వచ్చేలోపే రాహుల్ అయ్యాడు. వెంటనే ప్యాడ్స్ కట్టుకొని మైదానంలోకి వచ్చా. నేను రావడం కొంత ఆలస్యమైంది. రాహుల్ అంత త్వరగా ఔట్ అవుతాడని అస్సలు ఊహించలేదు.

నేను ఆడిన కెప్టెన్లలో అతనే అత్యుత్తమం : గంభీర్

బౌల్ట్ బౌలింగ్ ఆపాలనుకున్నా..

బౌల్ట్ బౌలింగ్ ఆపాలనుకున్నా..

ఈ టోర్నీ మొత్తం ధోనీ తర్వాతే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని స్పష్టంగా చెప్పారు. గతంలో నేను ఈ స్థానంలో బాగా రాణించానని ఆ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నారు. కానీ సెమీఫైనల్లో మూడో ఓవర్‌లోనే నేను బ్యాటింగ్‌కు వెళ్లా. ఎప్పుడు ఔటయ్యానో మాత్రం తెలియదు. అది అనవసరం కూడా.

కానీ నేను వికెట్లు పడకుండా ఆడుదాం అనుకున్నా. ముఖ్యంగా భారత్ టాపార్డర్ పతనాన్ని శాసించిన ట్రెంట్ బౌల్ట్ స్పెల్ అయిపోయే వరకు వేచి చూడాలనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు జిమ్మీ నీషమ్ అద్బుత క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది.'అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, April 22, 2020, 18:20 [IST]
Other articles published on Apr 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X