న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు మ్యాచ్‌లకే మర్చిపోతారా?.. విమర్శకులపై షమీ ఫైర్

India VS New Zealand Test Series: Mohammed Shami Strong Counter To Critics | Oneindia Telugu
Mohammed Shami Says It is easy to criticise somebody from outside

ముంబై: మూడు వన్డేల్లో వికెట్లు తీయనంత మాత్రాన జస్‌ప్రీత్‌ బుమ్రా అందించిన విజయాలను ఎలా మర్చిపోతారని విమర్శకులపై భారత పేసర్‌ మహ్మద్‌ షమీ ఆగ్రహంవ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా గాయపడి తిరిగొచ్చిన వెంటనే రాణించడం అంత సులువు కాదన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ముగిసిన అనంతరం షమీ మాట్లాడుతూ విమర్శకులకు చురకలంటించాడు.

బయట ఉండి మాట్లడటం సులువు..

బయట ఉండి మాట్లడటం సులువు..

బయట కూర్చొని ఇతరులను విమర్శించడం సులువని కానీ, ఆడేవారికి తెలుస్తుందని ఆ బాధేంటోనని షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మధ్య చాలా మంది ఆటగాళ్లను విమర్శిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డాడు.

‘3-4 మ్యాచుల్లో బాగా ఆడకపోతే అతన్ని విమర్శిస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలను. కానీ ఓ మూడు మ్యాచుల్లో వికెట్లు తీయనంత మాత్రాన మ్యాచులను గెలిపించే బుమ్రా సత్తాను, అందించిన విజయాలను ఎలా మర్చిపోతారు. ఒక్క సిరీస్ వైఫల్యంతో అతడు సాధించింది అంతా పక్కన పెట్టేస్తారా? మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఆ ఆటగాడికి మంచిది.

అది అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. గాయం నుంచి కోలుకొని వెంటనే రాణించడం కష్టమని ఒక క్రీడాకారుడిగా నాకు తెలుసు. వ్యాఖ్యానాలు చేస్తూ డబ్బులు సంపాదించేవారికి విమర్శించడం సులభం. ఆటగాళ్లకు గాయాలు సహజం. 2015లో నేనూ గాయపడ్డాను. ఆ తర్వాత పుంజుకున్నాను' అని షమీ ఫైర్ అయ్యాడు.

మార్చి 25న ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్.. కోహ్లీ, రోహిత్ ఒక్కటీమ్‌లోనే.. కెప్టెన్‌గా ధోని!

యువ ఆటగాళ్లకు సీనియర్లు అవసరం..

యువ ఆటగాళ్లకు సీనియర్లు అవసరం..

యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం ముఖ్యమని షమీ అభిప్రాయపడ్డాడు. 'అనుభవం కీలకం. అప్పుడే భయం లేకుండా ఉండగలరు. భిన్న పరిస్థితులను ఎదుర్కోవడం అవసరం. ఆ అనుభవం ఎంతో విలువైనది. ఒక యువ ఆటగాడి వెనక సీనియర్‌ ఉన్నప్పుడు అతడు త్వరగా పరిణతి సాధిస్తాడు.

మా జట్టులో మేం యువకులకు మార్గనిర్దేశం చేస్తాం. వారితో మాట్లాడతాం. జోకులు వేస్తాం. సైనీ పొడగరి. అతడిలో ప్రతిభ, వేగం ఉన్నాయి. అతడికి సుదీర్ఘ కాలం సీనియర్ల మద్దతు అవసరం. అతడు చాలా బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. కానీ అనుభవం వెంటనే రాదు. మేమంతా అతడికి సాయం చేస్తున్నాం. న్యూజిలాండ్‌ XIతో ఆడుతున్న పిచ్‌ చాలా బాగుంది. బౌలింగ్‌కు అనుకూలిస్తోంది' అని షమీ చెప్పుకొచ్చాడు.

వారెవ్వా బుమ్రా.. ఏం స్వింగ్ అది, తక్కువ అంచానా వేస్తే ఇలానే ఉంటది (వీడియో)

జహీర్, నెహ్రాసైతం..

జహీర్, నెహ్రాసైతం..

వన్డే సిరీస్‌లో పేలవమైన ఆటతీరుతో దారుణంగా విఫలమైన బుమ్రాకు మాజీ పేసర్లు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రాలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. బుమ్రా బౌలింగ్‌‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఆచితూచి ఆడటంతోనే విఫలమయ్యాడని, అతను తన అటాకింగ్ పెంచాలని జహీర్ సూచించాడు. ఇక ప్రతీ మ్యాచ్‌లో రాణించడం ఎవరికైనా కష్టమేనని, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా విఫలమయ్యాడని నెహ్రా బుమ్రాను వెనకేసుకొచ్చాడు.

అదరగొట్టిన బౌలర్లు..

అదరగొట్టిన బౌలర్లు..

ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మొత్తం రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్‌ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. వీరికి తోడుగా సైనీ 2 వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్టు 235 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్ రిషభ్ పంత్(70), మయాంక్(81) అగర్వాల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 48 ఓవర్లలో నాలుగు వికెట్లకు 252 పరుగులు చేసింది. దీంతో ఈ సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. బుమ్రా బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఔటైన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అంతేకాకుండా బుమ్రా బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించింది.

Story first published: Sunday, February 16, 2020, 18:09 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X