టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. తన ప్రియురాలు మహికా శర్మతో రోమాన్స్ మితిమీరి పోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన కారును వాష్ చేస్తూ.. మహికా శర్మను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా నెటిజన్లు మండిపడుతున్నారు.
'నువ్వు.. నీ ఏషాలు..కార్ కడుగుతూ ముద్దులేంట్రా!'అని విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు మహికా శర్మ మరుగుమందు పెట్టిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే ఈ కార్ వాష్ వీడియో ఘటన నవంబర్‌లో జరగ్గా.. ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోను మళ్లీ తెరపైకి తెచ్చారు.దాంతో హార్దిక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.


ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం కూడా హార్దిక్ పాండ్యా ఇలానే హద్దులు ధాటి ప్రవర్తించాడు. పబ్లిక్ ప్లేస్‌లో జనాల మధ్య.. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే సోయి లేకుండా మహికా శర్మను పదే పదే ముద్దాడాడు. ట్రోఫీ అందించిన పోడియంపై ఇద్దరు పడుకొని రొమాన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రియురాలు మహికా శర్మతో కలిసి హార్దిక్ బరితెగించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు అప్పట్లోనే మండిపడ్డారు.
భారత జాతీయపతకాన్ని తన భుజాలపై వేసుకొని ప్రియురాలితో పడుకోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనను తప్పుబడుతూ హార్దిక్ పాండ్యాపై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జాతీయ జెండాను అగౌరవపరిచాడనే ఆరోపణలపై బెంగళూరులోని శివాజీ నగర పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. పూణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ బిద్కర్ దాఖలు చేశారు. విజయోత్సవ వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, పాండ్యా జాతీయ జెండాను భుజంపై కప్పుకుని డాన్స్ చేయడం, గెంతడం కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన ప్రియురాలితో కలిసి స్టేజ్‌పై పడుకుని ఉండగా, అతని భుజంపై జెండా అలానే ఉందని, ఇది జాతీయ పతాకాన్ని కించపరిచినట్టేనని ఆరోపించారు. మహికా శర్మతో కలిసి డాన్స్ చేసేటప్పుడు గానీ, స్టేజీపై పడుకున్నప్పుడు గానీ హార్దిక్ పాండ్యా వీపునకు జాతీయ జెండా కట్టి ఉందని ఆయన గుర్తు చేశారు.
1971 జాతీయ పతాక చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం అతని చర్యలు జాతీయ పతాకాన్ని అవమానించినట్టే అవుతుందని వాజిద్ ఖాన్ తెలిపారు. అయినా కూడా హార్దిక్ పాండ్యా తన తీరు మార్చుకోకుండా మహికా శర్మతో రొమాన్స్ చేస్తూ వీడియోలను పబ్లిక్‌గా పంచుకుంటున్నాడు. నాలుగు గోడల మధ్య చేసుకోవాల్సిన రొమాన్స్.. ఇలా పబ్లిక్ చేసుకోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
