న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ బాయ్ కుళ్లుకోకు.. నీ ఫోటో కూడా పెడ్తాలే : చాహల్

Dont Be Jealous: Yuzvendra Chahal, Rohit Sharma Troll One Another On Instagram

హైదరాబాద్ : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్నేహం.. ఆఫ్ ఫీల్డ్ బంధం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా వీరు చేసే హంగామా అంత ఇంత కాదు. ట్విటర్ వేదికగా ఒకరిపై ఒకరు చేసుకునే కామెంట్స్.. పేల్చే జోకులు అభిమానులకు కావాల్సిన మజానిస్తుంటాయి. తాజాగా వీరి మధ్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటుంది.

నీ గురించి నీవు చూసుకో..

నీ గురించి నీవు చూసుకో..

చాహల్ తన ఇన్ స్టాగ్రామ్‌లో శ్రేయస్ అయ్యర్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. దీనికి ‘ఎప్పుడూ నీకు మద్దతుగా ఉంటా'అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి రోహిత్ ఫన్నీ వేలో స్పందించాడు. ‘శ్రేయ‌స్ సంగ‌తి త‌ర్వాత కానీ ముందు నీ గురించి నీవు చూసుకో' అంటూ చురకలంటించాడు.

కుళ్లుకోకు బాయ్..

దీనికి చాహల్ బదులిస్తూ..‘బాయ్ .. నువ్వు ఇక్కడ లేవని నన్ను మిస్స‌వుతున్నాన‌ని నాకు అర్థమవుతోంది. నీ ఫోటో పెట్టలేదని కుళ్లుకుంటున్నావని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే నీతో దిగిన పిక్‌ను పోస్టు చేస్తా' అని త‌న‌దైన శైలిలో చాహ‌ల్ స‌మాధాన‌మిచ్చాడు. దీనిపై అయ్య‌ర్ కూడా రోహిత్ ఈర్ష్యపడుతున్నాడనే అర్థం వచ్చేలా రెండు ఏమోజీల‌తో బ‌దులిచ్చాడు. సోష‌ల్ మీడియాలో వీరి సరదా సంభాషణ నెటిజ‌న్లను ఆకట్టుకుంటుంది.

బంగ్లా ఆటగాళ్లతో ఎప్పుడూ ఇదే సమస్య.. అప్పుడు నాగినీ.. ఇప్పుడు బాహాబాహీ

గాయంతో రోహిత్ దూరం..

గాయంతో రోహిత్ దూరం..

న్యూజిలాండ్ పర్యటన నుంచి కాలిపిక్క గాయంతో రోహిత్ శ‌ర్మ దూర‌మైన విషయం తెలిసిందే. ఐదో టీ20లో బ్యాటింగ్ చేస్తుండ‌గా.. హిట్‌మ్యాన్ గాయ‌ప‌డ్డాడు. గాయం తీవ్ర‌త దృష్ట్యా అతన్ని మిగ‌తా టూర్ నుంచి త‌ప్పించారు. ఇక టీ20 సిరీస్‌లో ఫ‌ర్వాలేద‌నిపించిన చాహ‌ల్‌.. వ‌న్డేల్లో‌ను రాణిస్తున్నాడు. తొలి వన్డేలో అవకాశం రాకపోగా.. రెండో వన్డేలో వచ్చిన చాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ సిరీస్‌ను 0-2తో ఒక మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. ఇక చివరిదైన మూడో వన్డే మంగ‌ళ‌వారం మౌంట్ మాంగ‌నీలో జరుగుతుంది.

మా వాళ్లు కొంచెం ఓవర్ చేశారు.. మా జట్టు తరఫున క్షమాపణలు చెబుతున్నా : బంగ్లా అండర్-19 కెప్టెన్

భారీ మార్పులు..

భారీ మార్పులు..

ఇక చివరి వన్డేలో భారత్ భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం మీడియాతో మాట్లాడుతూ మార్పులుంటాయని స్పష్టం చేశాడు. దీంతో పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, కేదార్ జాదవ్‌లపై వేటు పడే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో షమీ రానుండగా.. కేదార్ స్థానంలో మనీష్ పాండే తుది జట్టులోకి రానున్నాడు. ఓపెనర్లను మార్చాలని భావిస్తే పంత్‌కు అవకాశం ఉండొచ్చు.

Story first published: Monday, February 10, 2020, 19:12 [IST]
Other articles published on Feb 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X