Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026:అదరగొట్టిన అర్షద్ ఖాన్.. కుప్పకూలిన ఆర్‌సీబీ!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు చేతులెత్తేసారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది.

దేవదత్ పడిక్కల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(13 బంతులల్ో 5 ఫోర్లు, సిక్స్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్‌తో 12) కూడా తీవ్రంగా నిరాశపర్చారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్(3/22) మూడు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడాకు చెరో వికెట్ దక్కింది.

IPL 2026 Arshad Khan and Rashid Khan Shine as Gujarat Titans Bowl Out Royal Challengers Bengaluru for 155

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే జాకోబ్ బెతెల్(5) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే దూకుడుగా ఆడిన కోహ్లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడటంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో 2 వికెట్లకు 59 పరుగులు చేసింది.

ఆ వెంటనే కెప్టెన్ రజత్ పటీదార్‌(19)‌ను అర్షద్ ఖాన్ ఔట్ చేయగా..జితేష్ శర్మ(1)ను జాసన్ హోల్డర్ పెవిలియన్ చేర్చాడు. డేంజరస్ టీమ్ డేవిడ్(9)‌ను రషీద్ ఖాన్ ఔట్ చేయగా.. కృనాల్ పాండ్యా(4)ను అర్షద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ఆర్‌సీబీ 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

రొమారియో షెపెర్డ్‌తో కలిసి పడిక్కల్ జట్టు స్కోర్ 100 పరుగులు ధాటించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో రొమారియో షెపెర్డ్ ఔటవ్వగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను ఆడించినా ఫలితం లేకపోయింది. అతన్ని అర్షద్ ఖాన్ ఔట్ చేయగా.. జోష్ హజెల్ వుడ్ రనౌట్ అవ్వడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Thursday, April 30, 2026, 21:36 [IST]
Other articles published on Apr 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+