For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా ఆటగాళ్లతో ఎప్పుడూ ఇదే సమస్య.. అప్పుడు నాగినీ.. ఇప్పుడు బాహాబాహీ

Bangladesh Players Naagin Dance Then, Ugly Behavior Now In U19 World Cup 2020

From Nidahas Trophy to U-19 WC: When Bangladesh cricketers ugly behavior brought disrepute to the gentlemans game

హైదరాబాద్ : అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అదరగొట్టిన బంగ్లాదేశ్ తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌ భారత్‌ను మూడు వికెట్లతో (డక్‌వర్తలూయిస్) ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. సీనియర్, జూనియర్, పొట్టి, వన్డే ఇలా ఏ ఫార్మాట్‌ అయినా బంగ్లాదేశ్‌ ఐసీసీ ప్రపంచకప్‌ నెగ్గడం ఇదే తొలిసారి.

అయితే ఈ విజయానంతరం బంగ్లా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరే వారి గెలుపుకన్నా ఎక్కువగా చర్చనీయాంశమైంది. గెలిచిన ఆనందంలో భారత ఆటగాళ్ల పట్ల వారు ప్రవర్తించిన తీరును యావత్ క్రికెట్ ప్రపంచం తప్పుబడుతోంది. ఇక తమ తప్పును తెలుసుకొని ఆ జట్టు కెప్టెన్ అక్బర్ అలీ క్షమాపణలు కోరడం అతని పరణితి చాటగా.. సీనియ‌ర్ జ‌ట్టు ధోర‌ణిలోనే జూనియ‌ర్లు ప్ర‌వ‌ర్తించారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఐసీసీ సీరియస్..

తొలిసారి చాంపియన్‌గా నిలిచామన్న ఆనందంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్‌ రాగానే.. డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లంతా ఉద్వేగంతో ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చారు. అలా వస్తూనే భారత ఆటగాళ్లను గేలి చేస్తూ అరిచారు.

ముఖ్యంగా పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం రెచ్చిపోయాడు. భారత ఆటగాళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి కవ్వించాడు. ఒక‌ద‌శ‌లో ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు బాహాబాహీకి దిగ‌గా.. అంపైర్లు క‌లుగ చేసుకుని ప్లేయ‌ర్ల‌ను విడ‌దీసారు.

దీనిపై ఐసీసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. విచార‌ణ చేసి నివేదిక అందించాల‌ని మ్యాచ్ రిఫ‌రీని ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై భారత టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌గా.. మ్యాచ్ రిఫ‌రీ భార‌త మేనేజ‌ర్‌కు క్షమాపణలు చెప్పాడు. త్వ‌ర‌లోనే ఈ ఘ‌ట‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటామని హామీ ఇచ్చాడు.

సోష‌ల్ మీడియాలో ఈ ఘ‌ట‌న‌పై అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సినీయ‌ర్ల దారిలోనే జూనియ‌ర్లు న‌డుచుకుంటున్నార‌ని బంగ్లా ప్లేయ‌ర్ల‌కు చుర‌క‌లు అంటిస్తున్నారు. ఇక భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ సైతం బంగ్లా ఆటగాళ్ల సంబరాల పట్ల అసహనం వ్యక్తం చేశాడు. వాళ్ల సంబరాలు ఓ చెత్త అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

ఇలా బంగ్లా ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచి ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈ తరహా ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఆ దేశ క్రికెటర్లు.. అభిమానులు, వార్తా ప్రతికలు భారత క్రికెటర్లను అవమానపరిచే అనేక ఘటనలకు ఒడిగట్టారు.

నిదహాస్ ట్రోఫీ.. నాగిని డ్యాన్స్

నిదహాస్ ట్రోఫీ.. నాగిని డ్యాన్స్

2018‌లో భారత్, బంగ్లా, శ్రీలంక మధ్య జరిగిన నిదహాస్ ట్రోఫీలో బంగ్లా సీనియర్ ఆటగాళ్లు క్రీడాస్పూర్తి మరిచి వ్యవహరించారు. శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ జట్టు కెప్టెనే స్వయంగా అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ బ్యాట్స్‌మన్‌ను బయటకి రమ్మనడం వివాదాస్పదమైంది. డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగటకొట్టడం.. గెలిచిన ఆనందంలో ప్రత్యర్థి ఆటగాళ్లను గేలిచేస్తూ నాగిని డ్యాన్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

భారత్ ఓడిందనే ఆనందంలో ముష్పికర్ ట్వీట్..

భారత్ ఓడిందనే ఆనందంలో ముష్పికర్ ట్వీట్..

2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిన తర్వాత బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ చేసిన ట్వీట్ యావత్ క్రికెట ప్రపంచానికి ఆగ్రహం తెప్పించింది. సెమీస్‌లో భారత్ ఓడిందనే శునకానందంతో ‘సంతోషం అంటే ఇది.. హహహ.. భారత్ సెమీస్‌లో ఓడింది'అని మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ ఫొటోను జత చేస్తూ చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపింది. అప్పట్లో అతనిపై భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధోనిని అవమానపరిచిన బంగ్లాదేశ్ అభిమానులు..

ధోనిని అవమానపరిచిన బంగ్లాదేశ్ అభిమానులు..

2016 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరిందనే ఆనందంలో ఓ బంగ్లా అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ట్విటర్ వేదికగా.. బంగ్లా పేసర్ టస్కిన్ అహ్మద్.. ధోని తల నరికేసినట్లు ఉన్న ఫొటోను షేర్ చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఫైనల్లో బంగ్లాను భారత్ ఓడించింది.

కించపరిచిన బంగ్లా న్యూస్ పేపర్..

కించపరిచిన బంగ్లా న్యూస్ పేపర్..

2015లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌‌ను ఎదుర్కోవడంలో భారత ఆటగాళ్లు కొంత తడబడ్డారు. దీనిని హైలైట్ చేయడం కోసం ఓ న్యూస్ పేపర్( వీక్లీ మ్యాగ్‌జైన్) భారత ఆటగాళ్ల సగం గుండ్లు ఉన్న ఫొటోతో ఉన్న ఒక అడ్వర్టైజ్‌మెంట్ ప్రచురించి భారత అభిమానుల ఆగ్రహానికి గురైంది.

భారత త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచిన బంగ్లా ఫ్యాన్

భారత త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచిన బంగ్లా ఫ్యాన్

చాంపియన్స్ ట్రోఫీ-2017 సెమీస్‌లో బంగ్లాదేశ్‌, భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. పులి వేటాడుతున్న ఫొటోలో భారత త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచాడు. పులి బంగ్లాదేశ్ అని, బలయ్యే జంతువు భారత్ అనే అర్థం వచ్చేలా ఫొటోను ఎడిటి చేసి ట్విటర్‌లో షేర్ చేశాడు. దీనికి భారత అభిమానులు సైతం తమదైన రీతిలో బదులిచ్చారు.

Story first published: Monday, February 10, 2020, 18:59 [IST]
Other articles published on Feb 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+