GT vs RCB మ్యాచ్‌లో హైడ్రామా.. అంపైర్‌పై కోహ్లీ ఆగ్రహం!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫోర్త్ అంపైర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ వివాదాస్పద రీతిలో క్యాచ్ ఔటయ్యాడు.
అతను ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర జాసన్ హోల్డర్ అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ టైమ్ తీసుకోకుండా త్వరగా ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విరాట్ కోహ్లీతో పాటు ఆర్‌సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. రజత్ పాటిదార్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
అర్షద్ ఖాన్ వేసిన 8వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని రజత్ పాటిదార్ డీప్ బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్యాచ్ కోసం జాసన్ హోల్డర్, కగిసో రబడా ఇద్దరూ ప్రయత్నించారు. అయితే చివరి నిమిషంలో రబడా తప్పుకోగా.. హోల్డర్ డైవ్ చేసి అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది.

ఫీల్డ్ అంపైర్ మూడో అంపైర్ సమీక్ష కోరగా.. పలు కోణాల్లో రిప్లేలు పరిశీలించకుండానే ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై ఆర్‌సీబీ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్ర అసహనానికి గురైన కోహ్లీ.. బంతి నేలకు తాకిందని సైగలు చేస్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఆర్‌సీబీ ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్‌తో 12) కూడా తీవ్రంగా నిరాశపర్చారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్(3/22) మూడు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడకు చెరో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications