GT vs RCB: కోహ్లీ ఘోర తప్పిదం.. గుజరాత్ టైటాన్స్‌కు 5 పరుగులు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డర్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో మెరుపు క్యాచ్‌లు అందుకున్న కోహ్లీ.. మరెన్నో రనౌట్స్ కూడా చేశాడు.
అలాంటి కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఘోర తప్పిదం చేశాడు. అతని మిస్ ఫీల్డ్ కారణంగా గుజరాత్ టైటాన్స్‌కు అప్పనంగా 5 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ చేసిన ఈ ఫీల్డింగ్ మిస్టేక్ చూసి సహచర ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు.
జోష్ హజెల్ వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని జోష్ హజెల్ వుడ్ టైట్ షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేయగా.. శుభ్‌మన్ గిల్ డిఫెన్స్ చేసి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు.

బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కవర్స్ వైపు వెళ్లగా.. కోహ్లీ అందుకొని అంతే వేగంగా కీపర్ వైపు విసిరాడు. కానీ త్రో కీపర్‌కు దూరంగా విసరడంతో బంతి బౌండరీకి వెళ్లిపోయింది. బ్యాకప్ ఫీల్డర్ వెంకటేశ్ అయ్యర్ డైవ్ చేసినా లాభం లేకపోయింది. దాంతో గుజరాత్ టైటాన్స్‌కు 4+ సింగిల్‌తో ఐదు పరుగులు వచ్చాయి. దాంతో విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. శుభ్‌మన్ గిల్ రనౌట్ కోసం కోహ్లీ బంతిని విసిరేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత గిల్ క్యాచ్‌ను కోహ్లీనే అందుకున్నాడు. ఆ సమయంలో చాలా కోపంగా కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్‌తో 12) కూడా తీవ్రంగా నిరాశపర్చారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్(3/22) మూడు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడకు చెరో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications