Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి వల్లే ఈ ఓటమి.. మా బౌలర్లు బాగా పోరాడారు:రజత్ పాటిదార్

బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. శుభ్‌మన్ గిల్ పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడి తమపై ఒత్తిడి పెంచాడని, కానీ తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని కొనియాడాడు.

మిడిలార్డర్ వైఫల్యమే..

'మేం చేసిన పరుగులు ఈ వికెట్‌పై ఏ మాత్రం సరిపోవు. కానీ మేం బౌలింగ్ చేసిన తీరు.. మ్యాచ్‌ను 16వ ఓవర్ వరకు తీసుకెళ్లడం సానుకూల సంకేతం. ఈ పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల ఫాస్ట్ బౌలర్లకు సహకరించింది. ఇక శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో ఆడిన తీరు అద్భుతం. అతను మాపై ఒత్తిడి పెంచాడు. కానీ మేము తిరిగి పుంజుకుని మ్యాచ్‌ను 16వ ఓవర్ వరకు తీసుకురావడం సానుకూల అంశం.

IPL 2026 Rajat Patidar Blames Middle-Order Batting Collapse for RCB s Defeat against Gujarat Titans
Photo Credit: screen grab for JioHotstar

మేం మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అక్కడే మేం మెకబడిపోయాం. ఈ తప్పిదాలను మేం సరిచేసుకోవాలి. భువనేశ్వర్ కుమార్ ఎంతో అనుభవం కలిగిన టీ20 స్పెషలిస్ట్ బౌలర్. తొలి హాఫ్ సీజన్‌లో అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. మేం ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడతాం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడటమే మా లక్ష్యం.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన గిల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్(3/22) మూడు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం గుజరాత్ టైటాన్స్15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), జోస్ బట్లర్(19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్), రాహుల్ తెవాటియా(17 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/28) మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెపెర్డ్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. సుయాశ్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

Story first published: Friday, May 1, 2026, 0:08 [IST]
Other articles published on May 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+