For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రజత్ పాటిదార్ క్యాచ్ ఔట్‌పై వివాదం.. జేసన్ హోల్డర్ ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఔట్ అయిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో పాటిదార్ పుల్ షాట్ ఆడగా.. డీప్‌లో ఉన్న జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.

అయితే హోల్డర్ క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతి నేలకు తగిలినట్లు రిప్లేలో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్యాచ్ గేమ్ ఛేజింగ్ మూమెంటమ్‌గా నిలిచింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది.

సరైన క్యాచ్..

మ్యాచ్ అనంతరం ఈ క్యాచ్‌పై జేసన్ హోల్డర్ స్పందించాడు. సరైన క్యాచ్ అని చెప్పుకొచ్చాడు. కగిసో రబాడ ఢీకొట్టేలా కనిపించినా క్యాచ్ పూర్తి చేయాలనుకున్నానని తెలిపాడు. అద్భుతమైన ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో జేసన్ హోల్డర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన హోల్డర్.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు.

GT vs RCB Jason Holder Opens Up on the Controversial Rajat Patidar Catch and On-Field Collision Risk

'వ్యక్తిగతంగా నాకు ఈ రోజు నాకు బాగా కలిసొచ్చింది. కొన్ని రోజులు ఇలా అన్నీ మనకు అనుకూలంగా జరుగుతుంటాయి. మా జట్టు మొత్తం ఈ రోజు అద్భుతంగా రాణించింది. మ్యాచ్ ఆరంభం నుంచే మేం గొప్ప శక్తిని ప్రదర్శించాం. తొలి ఓవర్ తర్వాత మేం వికెట్లు తీయగలిగాం. ఆరంభంలో అందరూ కొంచెం ఆందోళనగా ఉన్నప్పటికీ.. పవర్‌ప్లేలో రబాడ, సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. వారు గేమ్‌ను మా వైపు తిప్పారు.

గాయమైనా క్యాచ్ పట్టాలనుకున్నా..

రజత్ పాటిదార్ క్యాచ్ పట్టే సమయంలో కగిసో రబాడను గమనించాను. అతన్ని ఢీకొట్టకూడదని కోరుకున్నాను. ఒకవేళ ఢీకొంటే ఎవరికి దెబ్బ తగిలేదో తెలీదు కానీ.. బంతి కింద పడకూడదని మాత్రం బలంగా అనుకున్నాను. నా కంటికి అతను కనిపిస్తున్నా.. క్యాచ్ పట్టేంత దూరం నాకే దగ్గరగా ఉందని నమ్మి ప్రయత్నించాను. బంతిని ఒడిసిపట్టుకోవడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను.

ఫీల్డింగ్‌లో ఎటు వెళ్లినా బంతి నా దగ్గరికే వచ్చింది. నిజానికి అది నేను కోరుకున్నది కాదు.. కానీ బంతి వస్తున్నప్పుడు కాదనలేను కదా? కొన్నిసార్లు అన్నీ మన దగ్గరకే వస్తాయి. నేను వాటి కోసం వెతకలేదు, కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని జట్టు విజయంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్రాంచైజీ పనితీరు చాలా బాగుంది. ఆశిష్ నెహ్రా ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. అవసరమైనప్పుడు వచ్చి జట్టును ఆదుకోవడమే నా పని. ఏ పరిస్థితి ఎదురైనా దానికి తగ్గట్లుగా ఆడి జట్టును గెలిపించడమే నా లక్ష్యం.'అని జేసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 1, 2026, 0:43 [IST]
Other articles published on May 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+