IPL చరిత్రలోనే వరస్ట్ ‘ఇంపాక్ట్’ సబ్? పాండ్యా ప్లాన్ అట్టర్ ఫ్లాప్!
ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకుంటున్న కొన్ని వింత నిర్ణయాలు అభిమానులను అయోమయంలో పడేస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దించిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత అతడిని ఏంటో తెలియక నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
వాంఖడేలో పరుగుల వరద
ఈ మ్యాచ్‌లో ముంబైలోని వాంఖడే స్టేడియం మరోసారి పరుగుల వరదకు వేదికైంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(123) అజేయ సెంచరీ సాధించి.. జట్టుకు 243 పరుగుల భారీ స్కోరును అందించాడు. ఇంత భారీ స్కోరు సాధించిన తర్వాత ముంబై విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే ఆ స్కోరును కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

ముంబై బౌలర్లను చీల్చి చెండాడిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే ముంబై బౌలర్లను చీల్చి ఉతికారేశారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా 54 పరుగులు సమర్పించుకోవడంతో ముంబై ఆత్మరక్షణలో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో రాబిన్ మింజ్ స్థానంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ ఆపద్భాంధవుడిగా మారుతాడని అంతా ఆశించారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం శార్దూల్ ఠాకూర్‌కు ఒక్క ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కళ్లముందే బౌలర్లు భారీగా పరుగులు ఇస్తున్నా.. స్టార్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీంతో ఐపీఎల్ చరిత్రలోనే శార్దూల్ ఠాకూర్ అత్యంత నిరుపయోగమైన ఇంపాక్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడని క్రికెట్ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు, కనీసం బౌలింగ్ కూడా వేయకుండా ఫీల్డర్‌గా మిగిలిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెన్, సలీల్ అరోరా మెరుపు దాడులతో కేవలం 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ముంబైకి షాక్ ఇచ్చారు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడిన మాటలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. తమ జట్టులో బౌలింగ్ ఆప్షన్లు తక్కువగా ఉన్నాయని, అందుకే ప్రత్యర్థిని అడ్డుకోలేకపోయామని హార్దిక్ కామెంట్ చేశాడు. పక్కనే శార్దూల్ లాంటి సీనియర్ ఆల్ రౌండర్ ఉండగా.. బౌలింగ్ ఆప్షన్లు లేవని కెప్టెన్ అనడం విడ్డూరంగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ సంప్రదాయానికి భిన్నంగా జట్టు ప్రదర్శన ఉందని అంగీకరించిన హార్దిక్ పాండ్యా.. తదుపరి మ్యాచ్‌లలో అయినా వ్యూహాలు మారుస్తారో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications