Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలింగ్ కాదు.. అదే మా విజయానికి కారణం: శుభ్‌మన్ గిల్

అద్భుతమైన ఫీల్డింగే తమ విజయానికి ప్రధాన కారణమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని ఓడించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. ఆర్‌సీబీ లాంటి భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టును 160 పరుగుల్లోపే కట్టడి చేయడం సంతోషంగా ఉందన్నాడు.

ఆర్‌సీబీని ఆలౌట్ చేశాం అంటే..

'చాలా సంతృప్తిగా ఉంది. ఇలాంటి వికెట్‌పై ఆర్‌సీబీ లాంటి జట్టును 160 పరుగుల లోపే కట్టడి చేయడం అంటే మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని అర్థం. మా విజయానికి మా ఫీల్డింగ్ ప్రధాన కారణం. కొన్ని మ్యాచ్‌ల్లో మేం సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు. కానీ ఈ రోజు అందరూ సమష్టిగా రాణించారు. మైదానంలో మా ఉత్సాహం బాగుంది. ముఖ్యంగా రెండో ఓవర్‌లో విరాట్ భాయ్ కొన్ని పరుగులు చేసిన తర్వాత, మేం పుంజుకున్న తీరు చాలా కీలకం.

IPL 2026 Shubman Gill Credits Exceptional Fielding for Gujarat Titans Win Over RCB

నిజానికి పవర్ ప్లేలో నేను దూకుడుగా ఆడాలని ఏం అనుకోలేదు. నేను ఆ జోన్‌లో ఉన్నట్లు అనిపించింది. తొలి బంతికే కొంచెం అదృష్టం కలిసి వచ్చింది. రెండో బంతి నా జోన్‌లోకి రావడంతో 'ఈ రోజు నా రోజే' అని అనిపించింది. చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాననిపించింది. అందుకే బౌలర్లపై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నాను.

కీలకమైన ఆటగాడు..

రాహుల్ తెవాటియా మా జట్టులో చాలా కీలకమైన ఆటగాడు. అతను మ్యాచ్‌ను ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. టైమౌట్ సమయంలో మేం దీని గురించే మాట్లాడుకున్నాం. మేం ఆశించిన దానికంటే కొన్ని వికెట్లు ఎక్కువే కోల్పోయాం. కానీ చివర్లో అతను కొన్ని మంచి పరుగులు చేసి జట్టును గెలిపించాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన గిల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), విరాట్ కోహ్లీ(13 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్(15 బంతుల్లో ఫోర్‌తో 12) కూడా తీవ్రంగా నిరాశపర్చారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్(3/22) మూడు వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్(2/29), రషీద్ ఖాన్(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం గుజరాత్ టైటాన్స్15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43), జోస్ బట్లర్(19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్), రాహుల్ తెవాటియా(17 బంతుల్లో 4 ఫోర్లతో 27 నాటౌట్) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/28) మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెపెర్డ్(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. సుయాశ్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

Story first published: Friday, May 1, 2026, 0:24 [IST]
Other articles published on May 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+