న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని గాయపర్చాలనే బీమర్ విసిరా: షోయబ్ అక్తర్

When Shoaib Akhtar apologised to MS Dhoni for ‘purposely’ bowling a beamer

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీని గాయపర్చాలనే దురుద్దేశంతోనే 2006 ఫైసలాబాద్‌ టెస్టులో బౌన్సర్ సంధించినట్లు పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించాడు. తాజాగా భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌చోప్రాతో యూట్యూబ్‌ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు, ఆటగాళ్ల మధ్య అనుబంధం గురించి సుదీర్ఘంగా మాట్లాడిన అక్తర్.. ధోనీని ఇబ్బంది పెట్టేందుకు ఆ టెస్టు మ్యాచ్‌లో తాను బీమర్‌ను అస్త్రంగా వాడుకున్నట్లు తెలిపాడు.

ఇక ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లని ఉతికారేసిన మహేంద్రసింగ్ ధోనీ (153 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్‌లతో 148 ) మెరుపు శతకం సాధించాడు. ఇక షోయబ్ అక్తర్ వేసిన ఓ ఓవర్‌లో ధోనీ మూడు ఫోర్లు బాదేశాడు. దాంతో.. సహనం కోల్పోయిన అక్తర్.. ప్రమాదకరరీతిలో బీమర్‌ను సంధించాడు. కానీ.. అది ధోనీకి దూరంగా వైడ్ రూపంలో వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.

పెయిన్ కిల్లర్లతో..

పెయిన్ కిల్లర్లతో..

ఆ ఘటనను తాజాగా గుర్తు చేసుకున్న అక్తర్.. ఆ మ్యాచ్‌లో తన ఎడమ కాలు విరిగిపోయినా పెయిన్‌కిల్లర్లు తీసుకొని మరీ ఆడినట్లు తెలిపాడు. ‘టీమిండియా ఇక్కడికి వచ్చినప్పుడు నా ఎడమకాలు విరిగిపోయింది. నాకింకా గుర్తుంది. అప్పుడు ఫైసలాబాద్‌ టెస్టులో ధోనీ శతకం బాదాడు. ఆ టెస్టులో ప్రతీరోజు ఇంజెక్షన్లు తీసుకొని బౌలింగ్‌ చేశాను. ఈ క్రమంలోనే ఒకరోజు 9 ఓవర్లే బౌలింగ్‌ చేశా.

చిర్రెత్తుకొచ్చి..

చిర్రెత్తుకొచ్చి..

అప్పుడెంత వేగంగా బంతులేసినా అతడు కొడుతూనే ఉన్నాడు. సెంచరీ చేయడంతో నాకు చిర్రెత్తుకొచ్చి కావాలనే బంతిని అతడి పైకి విసిరాను. వెంటనే క్షమాపణలు చెప్పాను. కానీ నా జీవితంలో అలా చేయడం అదే తొలిసారి. అలా చేయాల్సింది కాదు. దాని గురించి పశ్చాత్తాపపడ్డాను'అని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చెప్పుకొచ్చాడు.ఇదిలా ఉండగా, ధోనీకి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం.

రికార్డు భాగస్వామ్యం..

రికార్డు భాగస్వామ్యం..

తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 588 పరుగుల భారీ స్కోర్‌ చేయడంతో తర్వాత భారత్ 281/5తో నిలవగా ధోనీ(148), ఇర్ఫాన్‌ పఠాన్‌(90) రికార్డు భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. చివరికి భారత్ 603 పరుగులు చేయగా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ధోనీని నిలువరించడానికి అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేయని ప్రయత్నం లేదు.

ఆఖరికి స్పిన్నర్ డానిష్ కనేరియా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి.. బంతి అందకపోవడంతో ధోనీ స్టంపౌటయ్యాడు. పాకిస్థాన్ పర్యటనకి 2005- 2006లో వెళ్లిన భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడగా.. ధోనీ 59.66 సగటుతో 179 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీలానే ధోనీకి దూకుడెక్కువ.. కాకపోతే మాటల్లో కనిపించదంతే : మాజీ సెలెక్టర్

Story first published: Sunday, August 9, 2020, 16:14 [IST]
Other articles published on Aug 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X