న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇలానే ఆడితే బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తా? కోహ్లీని హెచ్చరించిన ధోనీ.. ఎప్పుడంటే?

When MS Dhoni demoted Virat Kohli to find his lost form

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడకే మారు పేరు. తన 12 ఏళ్ల కెరీర్‌లో విరాట్ తనదైన బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. మరెన్నో ఘనతలు అందుకున్నాడు. అలాంటి విరాట్ 2014లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు. దాదాపు జట్టు నుంచి చోటు కోల్పోయే దయనీయ పరిస్థితిని అధిగమించాడు. అదే ఏడాది భారత్.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 13.5 సగటుతో 135 పరుగులే చేశాడు. ఆ సిరీస్‌ వైఫల్యంతో ఈ ఢిల్లీ క్రికెటర్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో తీవ్రంగా తడబడ్డాడు.

అయితే ఈ కఠిన పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెస్టిండీస్ వికెట్ కీపర్ దినేశ్ రామ్‌దిన్ తాజాగా వెల్లడించాడు. ఆ ఇంగ్లండ్ సిరీస్ అనంతరం వెస్టిండీస్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడిందని, ఈ సిరీస్‌లో కోహ్లీ విఫలమైనా.. ధోనీ అండగా నిలిచాడని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

విరాట్‌కు ధోనీనే అండగా నిలిచాడు..

విరాట్‌కు ధోనీనే అండగా నిలిచాడు..

‘ఇంగ్లండ్ టూర్ వైఫల్యం అనంతరం వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా విరాట్ తడబడటం నాకు గుర్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో స్వింగ్ బౌలింగ్‌లో విరాట్ విఫలమవ్వడంతో మా బౌలర్లు అదే వ్యూహాన్ని ప్రయోగించారు. పలు మ్యాచ్‌ల్లో అతను త్వరగా ఔటయ్యాడు. అయినా అతన్ని ధోనీ జట్టు నుంచి తీసేయలేదు. కానీ మూడో స్థానంలో పరుగులు చేయకుంటే నాలుగో స్థానానికి డిమోట్ చేస్తానని హెచ్చరించాడు. అన్నట్లే ఓ మ్యాచ్‌లో నాలుగో లేక ఐదో స్థానంలోనో బ్యాటింగ్‌కు పంపాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో(చేసింది 62 రన్సే) సత్తా చాటాడు. తన పూర్వ వైభవాన్ని అందుకున్నాడు'అని రామ్‌దిన్ గుర్తు చేసుకున్నాడు.

ధోనీ గొప్ప వ్యక్తి..

ధోనీ గొప్ప వ్యక్తి..

ఇక ధోనీ అద్భుతమైన వ్యక్తని రామ్ దిన్ కొనియాడాడు. ‘ధోనీ అద్భుతమైన వ్యక్తి. వినయపూర్వకమైన తన వ్యక్తిత్వంతో భారత క్రికెట్‌కు ఎన్నో సేవలు చేశాడు. క్రికెట్‌లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్‌లో అతని వ్యక్తిత్వం స్పూర్తిదాయకం. ఆటగాళ్లకు అండగా నిలవడం, గేమ్‌ను అవగాహన చేసుకోవడంలో అతనికి సాటిలేరు. పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడం.. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం ధోనీకి వెన్నతో పెట్టిన విద్య.'అని రామ్‌దిన్ ప్రశంసించాడు.

రఫ్ఫాడించిన కోహ్లీ..

రఫ్ఫాడించిన కోహ్లీ..

ఇంగ్లండ్ వైఫల్యం అనంతరం భారత్ స్వదేశంలో వెస్టిండీస్ నాలుగు వన్డేల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో ఓ వన్డే రద్దవ్వగా భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఫస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(2) దారుణంగా విఫలమవ్వగా భారత్ కూడా ఓటమి చవిచూసింది. ఇక రెండో మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కోహ్లీ.. వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ 62 పరుగులతో తన ఫామ్ అందుకున్నాడు. చివరి మ్యాచ్‌లో ఏకంగా 127 పరుగులతో సెంచరీ చేసి.. తన బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించాడు.

ఆస్ట్రేలియాలో అదరగొట్టిన విరాట్..

ఆస్ట్రేలియాలో అదరగొట్టిన విరాట్..

ఈ కరీబియన్ సిరీస్ అనంతరం రెండు నెలలకే భారత్.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌లో విరాట్ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ సత్తా చాటాడు. 4 సెంచరీలతో ఏకంగా 692 రన్స్ చేశాడు. తద్వార ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే ధోనీ ఈ సిరీస్‌లోనే అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనంతరం టెస్ట్ పగ్గాలు అందుకున్న విరాట్.. సంప్రదాయక ఫార్మాట్‌లో భారత జట్టుకు అద్భుత విజయాలందించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలందించిన కెప్టెన్‌గా నిలిచాడు.

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ దూరం!

Story first published: Monday, August 31, 2020, 20:37 [IST]
Other articles published on Aug 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X